శ్రీకర్‌ భరత్‌: పడిగాపులు ఫలించిన  వేళ అదృష్టంతో టీమిండియాలో టెస్టు జట్టులోకి తెలుగోడు!

YouSay Short News App

భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో టీమిండియాకు వికెట్‌కీపర్‌గా చేసిన రెండో తెలుగువాడిగా అవకాశం దక్కించుకున్నాడు మన విశాఖ కుర్రాడు శ్రీకర్‌ భరత్‌. అద్భుత ఆటగాడే అయినా అదృష్టం అతడి తలుపు తట్టేందుకు ఇంతకాలం పట్టింది.

విశాఖపట్నం జిల్లాకు చెందిన కోన శ్రీకర్‌ భరత్‌. ఎన్నో ఏళ్లుగా జట్టులో స్థానం కోసం కలగంటూనే ఉన్నాడు. ఇండియాA,B జట్లకు పూర్తిస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నా జాతీయ జట్టులో మాత్రం అవకాశం రాలేదు

29 ఏళ్ల ఈ క్రెకటర్‌కు భారత జట్టులోకి నాలుగేళ్ల క్రితం నుంచే అప్పుడప్పుడూ పిలుపు అందుతున్నా.. తుది జట్టులో అవకాశం మాత్రం అద్భుతమైన బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో దక్కింది.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆరంగేట్రం చేయడంతో.. MSK ప్రసాద్‌ తర్వాత భారత్‌ తరఫున టెస్టుల్లో  వికెట్‌ కీపర్‌గా చేసిన రెండో తెలుగువాడిగా శ్రీకర్‌ భరత్‌ నిలిచాడు. మూడు ఫార్మట్లను పరిగణిస్తే భారత్‌కు ఆడిన మూడో వికెట్‌ కీపర్‌గా ఘనత సాధించాడు. అంతకు ముందు హైదరాబాద్‌ ఆటగాడు పోచయ్య కృష్ణమూర్తి భారత్‌ తరఫున వన్డేల్లో వికెట్‌కీపర్‌గా ఆడాడు.

2019లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తొలిసారి KS భరత్‌కు జాతీయ జట్టులోకి పిలుపువచ్చింది. అప్పుడు పంత్‌ను రంజీల కోసం వదిలేసిన సెలెక్టర్లు, వృద్ధిమాన్‌ సాహాకు స్టాండ్‌బై ప్లేయర్‌గా భరత్‌ను ఎంపిక చేశారు

2020లో వన్డేలో జట్టులో అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పంత్‌ కంకషన్‌కు గురికావడంతో…భరత్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ, అప్పటికే జట్టులో ఉన్న కే.ఎల్‌ రాహుల్‌ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.

2021 జనవరిలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు శ్రీకర్‌ భరత్‌ను జట్టులోకి తీసుకున్నారు. అదే ఏడాది మేలోనూ మరోసారి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సాహాకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కానీ గ్లోవ్స్‌ తొడిగే అదృష్టం మాత్రం రాలేదు.

నవంబర్‌ 2021లో తొలిసారి జాతీయ జట్టు తరఫున శ్రీకర్ భరత్ కీపింగ్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా గాయపడటంతో భరత్‌ బాధ్యతలు తీసుకున్నాడు. రెండు క్యాచ్‌లు, ఒక స్టంప్‌తో సత్తా నిరూపించుకున్నాడు.

2022 ఫిబ్రవరిలో శ్రీలంకతో సిరీస్‌తో జట్టుకు ఎంపికయ్యాడు. మేలో ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌కు జట్టులోకి ఎంపికైనా ఫీల్డ్‌లోకి దిగలేదు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత BGT2023 ద్వారా అవకాశం దక్కింది.

2015లో దిల్లీ రూ.10 లక్షలకు తీసుకుంది. 2021లో ఆర్సీబీ రూ.20 లక్షలకు తీసుకుంది. 2022లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. 2023లో గుజరాత్‌ టైటాన్స్‌ రూ.1.20 కోట్లను KS భరత్‌ను సొంతం చేసుకుంది.

IPL కెరీర్‌

2021 IPLలో శ్రీకర్‌ భరత్‌కు పలు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. అందులో దిల్లీ క్యాపిటల్స్‌పై చివరి బంతికి సిక్స్‌ కొట్టి ఆర్సీబీని గెలిపించిన మ్యాచ్‌తో శ్రీకర్‌ భరత్‌కు మంచి పేరు వచ్చింది.

దేశవాళిలో శ్రీకర్‌ భరత్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌ బ్యాటర్‌గా శ్రీకర్‌ భరత్‌ సంచలనం సృష్టించాడు.

శ్రీకర్‌ భరత్‌ కెరీర్‌ నంబర్స్‌