SS RAJAMOULI: శాంతినివాసం సీరియల్ నుంచి ఆస్కార్ వేడుక వరకు.. జక్కన్నను నిలబెట్టింది ఇదే!

YouSay Short News App

ఎస్ఎస్ రాజమౌళి. ఎన్నో ఏళ్ల తర్వాత భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు అందించిన డైరెక్టర్. RRR సినిమాతో ఇండియన్ మూవీ సత్తా చూపించిన విలక్షణ దర్శకుడు.

ప్రేక్షకుల నాడీ పట్టిన డైరెక్టర్. అందుకే తన కెరీర్‌లో ఫ్లాప్ అంటూ ఎరగడు. అందుకు కొన్ని కారణాలున్నాయి.

రాజమౌళి సినిమాలు వేరు

‘శాంతినివాసం’ సీరియల్‌తో డైరెక్టర్‌గా రాజమౌళి ఓనమాలు దిద్దారు. 2000 సంవత్సరంలో  ఈ సీరియల్ ప్రసారమైంది.

శాంతి నివాసంతో ఓనమాలు..

రాజమౌళి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా ఎదగడానికి ముఖ్య కారణం ఫిల్మ్ మేకింగ్. విభిన్న పంథాలో సినిమాను చిత్రీకరింస్తుంటాడు.

ఫిల్మ్ మేకింగ్..

తన సినిమాల్లో హీరోయిజంకు రాజమౌళి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ప్రతి సినిమాలో హీరో పాత్రను చక్కగా డిజైన్ చేసుకుంటాడు.

హీరోయిజం

హీరోలపైనే కాకుండా విలన్ క్యారెక్టరైజేషన్‌పై కూడా రాజమౌళి ఫోకస్ చేస్తారు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుందని రాజమౌళి భావన.

విలనిజం..

ఒక సినిమాకు ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళి ఎక్కడా పట్టాలు తప్పలేదు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఇంటర్వెల్, క్లైమాక్స్‌లను ప్లాన్ చేసుకుంటాడు.

ఇంటర్వెల్, క్లైమాక్స్..

తన సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుతాడు. బహుశా అందుకేనేమో జక్కన్న అనే బిరుదు వచ్చింది.

ప్రతి సీన్ ముఖ్యమే..

భావోద్వేగాలను కేంద్రంగా చేసుకుని రాజమౌళి సినిమా తీస్తుంటాడు. హ్యూమన్ ఎమోషన్స్‌ని సరిగ్గా రిఫ్లెక్ట్ చేయగలిగితే ఆడియెన్స్‌కి సులువుగా కనెక్ట్ అవుతుందని జక్కన్న అభిప్రాయం.

భావోద్వేగాలే ప్రధానంగా..

శత్రువుపై ప్రతీకారం తీర్చుకుంటే అది విజయమే. ఇదే పాయింట్‌ని రాజమౌళి తన సినిమాల ద్వారా చూపిస్తాడు.

రివేంజ్ డ్రామా..

సినిమా క్వాలిటీ విషయంలో రాజమౌళి అస్సలు రాజీపడడు. తను ఊహించిన సన్నివేశం తెరపైకి వచ్చేంత వరకూ కష్టపడుతాడు. తన టెక్నిషియన్లను కూడా ప్రోత్సహిస్తాడు.

నో కాంప్రమైజ్..

నటీనటుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో రాజమౌళి దిట్ట. యాక్టర్ల నుంచి వందకు వంద శాతం ఔట్‌పుట్‌ని తీసుకొస్తాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇలా వచ్చినవారే.

ప్రతిభను వెలికి తీసేలా..

తన సినిమాలకు దాదాపు ఒకే టీమ్‌తో రాజమౌళి పనిచేస్తుంటాడు. జక్కన్న చేసిన అన్ని సినిమాలకు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించడం దీనికి ఉదాహరణ.

దాదాపు ఒకే టీమ్‌తో..

రాజమౌళి తనని తాను సినిమా సినిమాకు మెరుగు పరుచుకుంటాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు.

సినిమా సినిమాకు మెరుగు..

తాను నాస్తికుడినని రాజమౌళి చెప్పుకొంటారు. అయితే, తన క్యారెక్టర్‌ని పక్కన పెట్టి సినిమాలు తీస్తానని చెబుతుంటారు. అలా సినిమాను ప్రొఫెషన్‌లా స్వీకరించి పనిచేస్తాడు.

ప్రొఫెషన్ వేరు..

మహేశ్‌బాబుతో అంతర్జాతీయ స్థాయి సినిమా తీయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా పనులను రాజమౌళి స్టార్ట్ చేయనున్నాడు.

మహేశ్‌తో

స్టూడెంట్ నం.1(2001) సింహాద్రి(2003) సై(2004) ఛత్రపతి(2005) విక్రమార్కుడు(2006) యమదొంగ(2007) మగధీర(2009) మర్యాద రామన్న(2010) ఈగ(2012) బాహుబలి: ద బిగినింగ్(2015) బాహుబాలి: ద కన్‌క్లూజన్(2017) ఆర్ఆర్ఆర్(2022)

రాజమౌళి సినిమాలు

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.