2022లో పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన తారలు

YouSay Short News App

2022లో ఎంతో మంది సినీ నటులు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. తమ చిత్రాల్లోని  చక్కని కథనంతో  భారీ విజయాన్ని అందుకుని దేశవ్యాప్తంగా అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

జక్కన్న డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్‌చరణ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇందులో రామ్‌గా నటించి విశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

రామ్‌చరణ్

అంతేగాకుండా ఆస్కార్ రేసులో నిలిచేందుకు అర్హుడైన నటుడిగానూ పేరొందాడు. ఎన్డీటీవీ ‘ట్రూ లెజెండ్’ అవార్డును చెర్రీకి బహూకరించింది.

తన నటనతో ప్రేక్షక గణాన్ని మైమరిపించే నటుడు జూనియర్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపారు. దీంతో ఎన్టీఆర్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆస్కార్ అవార్డు నామినేషన్లకూ ఎన్టీఆర్ అర్హుడిగా నిలిచాడు.

ఎన్టీఆర్

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. గతేడాది చివర్లో ఈ సినిమా విడుదలైన ఈ సినిమా గురించి విస్తృత చర్చ జరిగింది. ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డునూ సొంతం చేసుకున్నాడు.

అల్లు అర్జున్

అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమా ‘కాంతార’. హీరోగా, దర్శకుడిగా రిషభ్ శెట్టి సినిమాను భుజాన ఎత్తుకున్నాడు.  ఈ సినిమా అఖండ విజయం సాధించడంతో రిషభ్ పేరు  దేశమంతా వినిపించింది.

రిషభ్ శెట్టి

ఈ ఏడాది కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కమల్ హిట్ ట్రాక్ ఎక్కారు. భారతీయుడు 2 సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా వస్తుండటం విశేషం.

కమల్ హాసన్

కేజీఎఫ్2 సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మాస్ యాటిట్యూడ్‌తో యశ్ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ని ఏర్పరచుకున్నాడు. తెలుగు, హిందీ, తమిళంలోనూ యశ్‌కు అభిమానులు అయ్యారు.

యశ్

మారన్, నేనే వస్తున్నా, తిరు, ద గ్రే మ్యాన్ సినిమాలతో ధనుష్ పాపులర్ హీరో అయ్యాడు. హాలీవుడ్ సినిమాతో ధనుష్ పేరు మరింత మార్మోగిపోయింది.

ధనుష్

కేజీఎఫ్2లో అధీర పాత్రలో నటించి మెప్పించాడు సంజయ్ దత్. హిందీలోనే కాకుండా కన్నడ, తెలుగు భాషల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తుల్సీదాస్ జూనియర్, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలతోనూ సంజయ్ దత్ ఆకట్టుకున్నాడు.

సంజయ్ దత్

సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఇమేజ్‌ను పెంచేసుకున్న మలయాల హీరో ‘దుల్కర్ సల్మాన్’.  క్లాసికల్ హిట్‌తో పాటు చుప్ వంటి త్రిల్లర్ మూవీతోనూ ప్రజల దృష్టిని ఆకర్షించాడు.

దుల్కర్ సల్మాన్

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఈ ఏడాదిలో సమంత నటించిన ‘కణ్మని రాంబో ఖతీజ’ సినిమా చేశారు. పుష్ప2లో ‘ఊ అంటావా’ ఐటం సాంగ్‌తో సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది.

సమంత

పుష్ప2, సీతారామం సినిమాలతో రష్మిక ఫ్యాన్ బేస్‌ని పెంచుకుంది. నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ రెండు సినిమాలు హిట్ కొట్టడంతో రష్మిక ఇమేజ్ మరింత పెరిగింది.

రష్మిక మందన్న