Sunburn 2022 :ఇండియాలో బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్
YouSay Short News App
పాశ్చాత్య దేశాల్లో విశేషంగా ఆదరణ పొంది మన దేశానికి పాకిన ‘సన్‌బర్న్’ మ్యూజికల్ ఈవెంట్ ఈ మరో వారంలో జరగనుంది. మునపటితో పోలిస్తే మరింత హుషారుగా, ఉత్సాహంగా జరగనుండటం విశేషం.
ఈ మ్యూజికల్ ఈవెంట్‌కి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీలకు కేరాఫ్ అడ్రస్ అయిన గోవాలో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి.
డిసెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సన్‌బర్న్ వేడుకలు జరగనున్నాయి. 16వ ఎడిషన్‌కి గోవాలోని వెగేటర్ బీచ్ వేదికైంది.
ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే మూడో వేడుక ఇది. ఇక్కడికొచ్చిన ప్రేక్షకులు తన్మయత్వంతో ఊగిపోవాల్సిందే. ఈ వేడుకను OG ఫెస్టివల్‌తో పోల్చడంలో అతిశయోక్తి లేదు.
ఈ వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు పేరొందిన డీజేలు భారత్‌కు రానున్నారు. హార్డ్‌వెల్, అవిక్కి, చైన్‌స్మోకర్స్, డేవిడ్ గుయెట్టా, మార్టిన్ గారిక్స్ గత వేడకల్లో సందడి చేశారు.
ఈ ఏడాది జరిపే సన్‌బర్న్ వేడుక థీమ్.. ‘నేటి వర్తమానమే రేపటి భవిష్యత్’. మొత్తంగా ఏడు స్టేజీలను సిద్ధం చేస్తున్నారు. 120 మంది దేశీయ, విదేశీ కళాకారులు ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్, లేజర్ షోలు, స్పెషల్ ఎఫెక్టులు, భారీ స్పీకర్లు ఇలా అదొక మాయా ప్రపంచంలా ఉంటుంది.
సంగీతాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన వారికి కాస్త మజా ఉండకపోతే ఎలా? అందుకే ఇక్కడ ప్రత్యేక ఫుడ్‌కోర్టులు, సేదతీరేందుకు సన్‌సెట్ పాయింట్లు, ఓపెన్ ఎయిర్ సినిమా, జిప్ లైనింగ్, ఫెర్రిస్ వీల్ వంటి ఏర్పాట్లూ ఉన్నాయి.
డిసెంబరు 27న ఘనంగా ఈ వూడేర సకనానంభం అవుతుంది. మూడు రోజుల్లో ఎప్పుడైనా వేడుకలో పాల్గొనవచ్చు.
మూడో రోజైన డిసెంబరు 30న అసలు సిసలైన వేడుకలు జరుగుతాయి. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నట్లు.. మిరుమిట్లు గొలిపేలా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ భలే ఉంటుంది.
మైమరిచిపోయే సన్‌బర్న్ 2022 కి వెళ్లాలని ఉందా? అయితే వెంటనే టికెట్లు బుక్ చేసుకోంది. వేడుకకు అనుమతించే పాసులు రూ.3వేల నుంచి అందుబాటులో ఉన్నాయి.