సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాలు

YouSay Short News App

నట ప్రస్థానం,  NTRతో విభేదాలు,

సూపర్ స్టార్ బిరుదు

తొలి తరం తెలుగు సినిమాకు రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. కృష్ణ మూడో నేత్రం లాంటి వారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ స్ఫూర్తితో సినిరంగ ప్రవేశం చేసిన కృష్ణ.. సూపర్ స్టార్ స్థాయికి ఎదిగి వారి సరసన చేరారు.

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ కృష్ణనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి కృష్ణ. అలాంటి నట దిగ్గజం జీవిత విశేషాలపై పూర్తి కథనం మీకోసం

గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో 1943 మే 31న ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మకు కృష్ణ జన్మించారు.

జననం

కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ.

కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు, అతనికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరుగా చూడాలని కోరిక .

బాల్యం- విద్యాభ్యాసం

ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివాడు సి.ఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణకు, మురళీమోహన్ క్లాస్‌మేట్

కృష్ణ చూసిన తొలి చిత్రం 'పాతాళభైరవి'. బాగా ఆకట్టుకున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్‌కి కృష్ణ వీరాభిమాని అయ్యారు.

NTRకు వీరాభిమాని

'దేవదాసు' వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలికి వచ్చిన ANR, సావిత్రిలను చూడడానికి వేల మంది జనం వచ్చారు. ఒక హీరోను ఇంతగా అభిమానిస్తారా ? అని కృష్ణ ఆశ్చర్య పోయారు. అప్పుడే ఆయన హీరో కావాలని నిశ్చయించుకున్నారు.

నటనకు బీజం

విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలో రాణించాలంటే నాటకాల్లో ఫ్రూవ్‌ చేసుకోవాలని కొంతమంది సినీ పెద్దలు ఆయనకు సలహా ఇచ్చారు.

నాటకాలతో మొదలు

1960లో కృష్ణ తొలిసారిగా స్టేజ్‌ మీద 'చేసిన పాపం కాశీకెళ్ళినా' అనే నాటకంలో నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం.

'భక్త శబరి', 'సీతారామ కళ్యాణం', 'ఛైర్మన్‌' వంటి నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

కృష్ణ తొలిసినిమా తేనె మనసులు. ఈ సినిమా చేసేటప్పుడు కృష్ణ గారిని బక్కగా ఉన్నావు సినిమాలకు పనికిరావు అన్నారట. కానీ ఈ సినిమా డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు కృష్ణకు అవకాశం ఇచ్చారు.

సినీ ప్రస్థానం

'తేనెమనసులు' విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటుడిగా అందరి ప్రశంసలందుకున్నారు కృష్ణ.  ఆ తర్వాత కేరీర్‌లో వెనుదిరిగి చూసుకునే అవకాశం ఆయనకు రాలేదు.

సినీరంగప్రవేశం చేసిన 9 ఏళ్లలోనే కృష్ణ 100 సినిమాలు పూర్తి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఇదొక రికార్డు.

ఇప్పటి వరకు 350పైగా చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించారు.

సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ మెప్పించారు.

1970లో జ్యోతిచిత్ర పత్రిక సూపర్ స్టార్ బిరుదుకు తగ్గ వ్యక్తిని ప్రజలే ఎన్నుకునేలా పోటీ పెట్టింది.ఏటా కృష్ణనే ఎన్నికయ్యేవాడు.  వరుసగా నాలుగేళ్లు  కృష్ణనే ఎంపికకావడంతో  ఆ బిరుదు ఆయనకు సార్థకమైంది.

సూపర్ స్టార్ బిరుదు

కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది. కృష్ణ, ఇందిరలకు రమేష్ బాబు, మహేష్ బాబుతో పాటు మరో ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

వ్యక్తిగత జీవితం

1969లో తన తోటి నటి విజయ నిర్మలను కృష్ణ గారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య ఇందిర వీరి వివాహానికి అంగీకరించింది.

1980ల్లో  NTR రాజకీయ రంగ ప్రవేశానికి కృష్ణ మద్దతు ఇచ్చారు.1982లో  టీడీపీ సిద్ధాంతాలకు అనుకూలంగా "ఈనాడు" సినిమా తీశారు. టీడీపీ ప్రచారానికి ఈ సినిమా బాగా ఉపయోగపడింది.

NTRతో విభేదాలు:

1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు  ఓ పేపర్‌లో ఫుల్‌పేజీ ప్రకటన విడుదల అయింది. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలకు దారితీసింది.

NTRతో విభేదాలతో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి  1989లో  ఏలూరు లోక్‌సభ నుంచి పోటీచేసి విజయం సాధించారు.

రాజకీయ ప్రవేశం

1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కృష్ణ ఏలూరు స్థానం నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

అల్లూరి సీతారామరాజు మూవీకి 1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

పురస్కారాలు

2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వంటి గౌరవాలు కృష్ణకు లభించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది.