టీ20 వరల్డ్ కప్  టీం ఆఫ్‌ ది టోర్నమెంట్‌

YouSay Short News App

టీ20 వరల్డ్‌కప్‌లో టీం ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ICC ప్రకటించింది. ఇందులో కేవలం ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. హార్దిక్‌ పాండ్యాను 12వ ఆటగాడిగా ఎంచుకుంది.

ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ప్రపంచ కప్ లో రెండు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. సెమీస్ లో భారత్ పై 47 బంతుల్లో 86 పరుగులు సాధించి జట్టను ఫైనల్ కు చేర్చాడు. టోర్నమెంట్ లో 42.40 యావరేజ్,147.22 స్ట్రైక్ రేట్‌తో 212 పరుగులు చేశాడు.

అలెక్స్ హేల్స్- ఇంగ్లండ్

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్‌ బట్లర్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కివీస్ పై 47 బంతుల్లో 73 పరుగులు..టీమిండియాపై 49 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లాండ్ జట్టులో 225 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. యావరేజ్ 45, స్ట్రైక్ రేట్-144.23

జోస్ బట్లర్-ఇంగ్లండ్

ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన స్టైల్ ప్రదర్శన చేశాడు. ప్రపంచకప్ లో 296 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 98.66 యావరేజ్ నమోదు చేశాడు. సూపర్-12లో పాక‌్‌పై మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు.

విరాట్ కోహ్లీ-ఇండియా

టీమిండియాలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే సూర్య కుమార్ యాదవ్ కోహ్లీ స్థాయిలో ప్రదర్శన ఇచ్చాడు. తన విలక్షణ బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. 189.68 స్ట్రేక్ రేట్ తో 239 పరుగులు సాధించాడు.

సూర్య కుమార్ యాదవ్-ఇండియా

ఈ ప్రపంచకప్ లో సెంచరీ సాధించిన రెండో ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ . న్యూజిలాండ్ ను సెమీస్ చేర్చేందుకు బ్యాట్‌తో విశ్వరూపం చూపించాడు. 40.20 యావరేజ్, 158.26 స్ట్రైక్ రేట్ తో 201 పరుగులు చేశాడు.

గ్లెన్ ఫిలిప్స్- న్యూజిలాండ్

టోర్నమెంట్ లో జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా  బ్యాట్, బాల్ తో ఆల్ రౌండ్ ప్రదర్శతో ఆకట్టుకున్నాడు.. 147.97 స్ట్రేక్ రేట్ తో 219 పరుగులు చేసి జింబాంబ్వే నుంచి అత్యధిక రన్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 10 వికెట్లు కూడా పడగొట్టాడు.

సికిందర్ రజా-జింబాబ్వే

పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ బాల్ తో మెరుపులు మెరిపించాడు. ఈ వరల్డ్ కప్ లో 6.34 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ తనదైన ఆటతో అదరగొట్టాడు.

షాదాబ్ ఖాన్- పాకిస్థాన్

వరల్డ్ కప్‌లోని అన్ని మ్యాచుల్లోనూ సామ్ కరన్ అద్భుతంగా ఆడాడు. డెత్ ఓవర్స్ లో సూపర్ బౌలింగ్ చేశాడు. ఫైనల్‌లో పాక్ మూడు వికెట్లు తీసిన ఆల్ రౌండర్ మెుత్తంగా 13 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, టోర్నమెంట్ సాధించాడు.

సామ్ కరన్‌- ఇంగ్లాండ్

సౌతాఫ్రికా బౌలర్ ఎన్రిచ్ నోకియా సూపర్-12 లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. బౌలింగ్ వేరియేషన్స్‌తో  కేవలం 5 మ్యాచుల్లోనే 11 వికెట్లు తీశాడు. 5.37 ఎకానమీ నమోదు చేసి ఆశ్చర్యపరిచాడు.

ఎన్రిచ్ నోకియా- సౌతాఫ్రికా

ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వేగంతో బంతులు వేసిన ఆటగాడిగా మార్క్ వుడ్ నిలిచాడు. 150KPH వేగంతో బౌలింగ్ చేసి 4 మ్యాచ్ లలో 9 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా సెమీస్, ఫైనల్స్ ఆడలేకపోయాడు.

మార్క్ వుడ్- ఇంగ్లాండ్

పాకిస్థాన్ స్టార్ బౌలర్ టీంకు అత్యవసరమైన పరిస్థితుల్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. గ్రూప్ స్టేజిలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టాడు. సెమీస్ లో ఫిన్ అలెన్, ఫైనల్స్ లో హేల్స్ వికెట్లు తీశాడు. ఫైనల్‌లో గాయపడి మరో ఓవర్ వేయలేకపోయాడు..

షహీన్ షా అఫ్రిదీ-పాకిస్తాన్

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్ తో అలరించాడు. 6 వికెట్లు తీయడంతో పాటు టీంలో 3వ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెమీస్ లో 33 బాల్స్ 63 పరుగులు సాధించి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.

హార్దిక్ పాండ్యా- టీమిండియా