T20WC: సెమీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఢీ.. కంగారూలను ఓడించగలమా..!

YouSay Short News App

మహిళల టీ20 ప్రపంచకప్‌లో కీలక పోరుకు భారత్ సిద్ధమైంది. గ్రూప్ దశలో సత్తా చాటి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.

సెమీఫైనల్‌లో భారత్ పటిష్ఠమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలిచిన చరిత్ర లేదు.

కంగారూలతో పోరు..

ఆరంభం నుంచి భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. గ్రూప్ దశలో ఇంగ్లాండ్ జట్టుతో తృటిలో ఓటమిని ఎదుర్కొంది. మిగతా 3 మ్యాచుల్లోనూ విజయం సాధించి ‘గ్రూప్-బి’లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

రెండో స్థానంలో భారత్

టోర్నీలోనే అత్యంత పటిష్ఠమైన జట్లలో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంటుంది. ఊహించినట్లుగానే గ్రూప్ దశలో చెలరేగి 4 మ్యాచుల్లోనూ గెలిచింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ‘గ్రూప్-ఎ’లో టాప్ ప్లేసులో ఉంది.

ఆసీస్ డామినేషన్

ఫిబ్రవరి 23న ఈ రెండు జట్లు తొలి సెమీఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఇందులో ఆస్ట్రేలియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

తొలి సెమీఫైనల్

ఈ ప్రపంచకప్‌కి ముందు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. 5 టీ20ల సిరీస్‌లో సొంతగడ్డపై భారత్ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మిగతా నాలుగింట్లోనూ కంగారూ అమ్మాయిలే పైచేయి సాధించారు. ఈ ఫోబియా భారత్‌ను వెంటాడుతోంది.

వెంటాడుతున్న ఫోబియా

సమష్టిగా రాణిస్తే ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత అమ్మాయిలు ఫామ్‌లో ఉన్నారు.

గెలుపు సాధ్యమే..

ఓపెనర్ స్మృతి మంధాన టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. చివరి రెండు ఇన్నింగ్సుల్లో 87, 52 పరుగులతో దూకుడు కొనసాగిస్తోంది.

ఓపెనర్లపై ఆశలు..

డ్యాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ భారీ స్కోరు సాధించాల్సి ఉంది. గ్రూప్ దశ మ్యాచుల్లో వరుసగా 33, 28, 8, 24 స్కోర్లు చేసింది. మంధానకు షెఫాలీ తోడైతే భారత్‌కు శుభారంభం లభించినట్లే.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్ లేమి జట్టుని ఇబ్బంది పెడుతోంది. కెప్టెన్‌ నుంచి జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శనను ఆశిస్తోంది. గ్రూప్ దశలోని 4 మ్యాచుల్లో వరుసగా 16, 33, 4, 13 పరుగులు చేయడం గమనార్హం.

కెప్టెన్ ఈ సారైనా…!

వన్‌డౌన్‌లో వస్తున్న జెమిమా రోడ్రిగ్స్, మిడిలార్డర్ బ్యాటర్ రిచా ఘోష్ స్థిరంగా రాణిస్తున్నారు. జట్టుకు అవసరమైన సమయాల్లో పరుగులు చేస్తున్నారు.

వీరిద్దరూ భేష్..

జెమీమా రోడ్రిగ్స్ గ్రూప్ దశలో 53*, 1, 13, 19 పరుగులు చేసింది. రిచా ఘోష్ తొలి 3 మ్యాచుల్లో 31*, 44*, 47* పరుగులు చేయగా, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయింది.

బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రాణిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో ఎక్కువ సేపు క్రీజులో ఉండట్లేదు. కీలక సమయాల్లో వికెట్ సమర్పించుకుంటోంది.  బౌలింగ్‌లో 4 మ్యాచుల్లో 5 వికెట్లు తీసుకోగా, రెండు ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 0, 7 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీప్తి శర్మ క్లిక్ అయ్యేనా

బౌలర్లలో శిఖా పాండే, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ తమలోని ప్రతిభను బయటపెట్టాల్సిందే. తమ శక్తి మేరకు రాణిస్తే బౌలింగ్‌లో భారత్‌కు తిరుగుండదు.

బౌలింగ్ దళం..

ఆస్ట్రేలియాలో స్టార్ హిట్టర్లు, ఆల్‌రౌండర్లకు కొదవలేదు. కెప్టెన్ మెగ్ లానింగ్, ఆశ్లీ గార్డ్‌నర్, ఎలిస్ పెర్రీ, కిమ్ గరాత్, మెక్‌గ్రత్ వంటి ప్లేయర్లు భారత్‌ను ఇబ్బంది పెట్టగలరు.

స్టార్ హిట్టర్లే..

భారత్‌ను డాట్‌బాల్స్ సమస్య వేధిస్తోంది. గ్రూప్ దశలో ఇంగ్లాండ్‌పై ఓటమికి ఇది కూడా కారణం. సెమీఫైనల్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టాలని భారత్ ఆశిస్తోంది. కెప్టెన్ హర్మన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.

డాట్‌బాల్స్ సమస్య...

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ సెమీఫైనల్‌ మ్యాచ్‌కి వేదిక. ఈ మైదానంలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించడం కాస్త కలిసొచ్చే అంశం.

కలిసొచ్చే మైదానం..

టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. భారత్ ఈ మైదానంలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఛేజింగ్ చేసే గెలిచింది. భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఛేజింగ్‌కే మొగ్గు..

రెండో సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు పోటీ పడనున్నాయి. ఫిబ్రవరి 24న మ్యాచ్ జరగనుంది.

ఇంగ్లాండ్ vs సౌతాఫ్రికా