విరాట్ కోహ్లీకి ఈ వేదికపై అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన రికార్డు ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఈ మైదానంలో విరాట్ పరుగుల వరద పారించాడు.
రారాజు విరాట్
అడిలైడ్ అనగానే కోహ్లీకి సొంత మైదానంలో ఆడినట్లు ఉంటుంది. అతడి ప్రదర్శన, గణాంకాలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది.
సొంత మైదానంలా...
విరాట్ మొత్తంగా ఇక్కడ 14 ఇన్నింగ్స్ ఆడాడు. 907 పరుగులు చేశాడు. 75.5 సగటుతో మెరుగైన రికార్డును కలిగిఉన్నాడు.
75.5 సగటుతో
ఈ వేదికపై కోహ్లీ రెండు టీ20లు ఆడాడు. ఈ రెండు మ్యాచుల్లో కలిపి విరాట్ 154 పరుగులు చేశాడు. ఇటీవల బంగ్లాపై 64 పరుగులు చేయగా, 2016లో 90 పరుగులు చేశాడు. 155.5 స్ట్రైక్ రేటుతో కోహ్లీ చెలరేగడం విశేషం.
2 మ్యాచుల్లో 154 రన్స్
విదేశాల్లో తన తొలి సెంచరీని నమోదు చేసింది అడిలైడ్‌లోనే. 2012లో కోహ్లీ ఈ ఫీట్‌ని అందుకున్నాడు. అందుకే కోహ్లీకి ఈ గ్రౌండ్ అంటే అభిమానం కూడా.
తొలి సెంచరీ
కెప్టెన్‌గానూ తొలి సెంచరీని నమోదు చేసింది ఇక్కడే. 2014లో రెండు ఇన్నింగ్సుల్లోనూ వరుస సెంచరీలను చేసి టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు.
కెప్టెన్‌గానూ..
ఒకే వేదికలో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాట్స్‌మన్ కూడా విరాటే. అడిలైడ్ వేదికగా ఈ అగ్రెసివ్ బ్యాటర్ ఏకంగా 5 సెంచరీలు చేశాడు. వ్యక్తిగతంగా విరాట్‌కు కూడా ఇదే అత్యుత్తమం.
5 సెంచరీల రికార్డు..
కోహ్లీ ఇక్కడ ఎనిమిది ఇన్నింగ్సులు ఆడాడు. అందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉండటం విశేషం.
టెస్టుల్లో...
వన్డేల్లోనూ కోహ్లీ ఈ మైదానంలో మెరుగైన ప్రదర్శన చేశాడు. 4 మ్యాచులు ఆడగా ఇందులో రెండు సెంచరీలను నమోదు చేశాడు. ఈ రెండు సెంచరీలు కూడా గత చివరి రెండు వన్డేల్లో చేసినవే.
4వన్డేల్లో 2 సెంచరీలు...
అడిలైడ్‌లో ఆడటమంటే నాకు ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. సొంత మైదానానికే వచ్చానేమో అని అనిపిస్తుంది. ప్రాక్టీస్ సెషన్లలో కూడా ఈ ఫీల్ ఉంటుంది. అందుకే ఆడటానికి ఇష్టపడతా
విరాట్ మాటల్లో..
కోహ్లీకి ఈ మైదానంలో ఆడిన అనుభవం టీమిండియాకు కలిసొస్తుందనడంలో సందేహం లేదు. పైగా పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు కాస్త సహకరిస్తుంది. స్పిన్‌ని విరాట్ సమర్థంగా ఎదుర్కోగలడు.
టీమ్‌కు ప్లస్ పాయింట్...
ఈ ప్రపంచకప్‌లో అడిలైడ్ వేదికగా ఇండియా బంగ్లాదేశ్‌తో ఆడి విజయం సాధించింది. కానీ, ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ ఆడలేదు. ఇది కూడా భారత్‌కు కలిసొచ్చేదే.