ఇతర దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే. కానీ, భారత్‌లో అదొక ఎమోషన్. కోట్ల మంది భావోద్వేగం. ప్రపంచంలో ఏ మారుమూల స్టేడియంలో మ్యాచ్ జరిగినా.. భారత అభిమానులు అక్కడ ప్రత్యక్షమవ్వడం దీనికి నిదర్శనం.
క్రికెట్ ఒక ఎమోషన్..
సాధారణంగానే మనం సెంటిమెంట్లను బాగా నమ్ముతుంటాం. క్రికెట్‌లో కూడా ఇది బాగా వ్యాప్తి చెందింది. అందుకే అప్పుడప్పుడూ మునుపటి సారూప్యతలను పోల్చుకుంటూ గెలుపోటములను బేరీజు వేసుకుంటుంటాం.
సెంటిమెంట్లు..
2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు చేరుకుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లూ ఈ దశకు చేరుకున్నాయి. న్యూజిలాండ్ టేబుల్ టాపర్‌గా నిలవగా.. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు అనూహ్యంగా సెమీస్‌లోకి ప్రవేశించాయి.
అనూహ్యంగా..
ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు కొన్ని సెంటిమెంట్లు కలిసొస్తున్నాయి. భారత్ ఆడిన 5 మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి, సౌతాఫ్రికా జట్టుపై మాత్రమే ఓడిపోయింది. 2011 వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇలాగే కేవలం సౌతాఫ్రికా జట్టుపైనే గ్రూప్ దశలో ఓడిపోయింది.
సౌతాఫ్రికా ఓటమి..
ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో నెగ్గింది. 2011లోనూ బ్రిటీషు జట్టుపై ఐర్లాండ్ గెలుపొందింది. దీంతో ఈసారి కప్పు మనదేనని అభిమానులు ఆనందపడుతున్నారు.
ఐర్లాండ్ గెలుపు..
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. 2011లోనూ క్వార్టర్ ఫైనల్స్‌లో టీమిండియా చేతిలో ఆసీస్ ఓడిపోయింది.
ఆస్ట్రేలియా ఇంటికి..
ఈ ప్రపంచకప్‌లో ఇండియాతో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్లోకి అడుగు పెట్టాయి. 2011 వన్డే వరల్డ్‌కప్‌లోనూ సెమీస్‌లోకి ఇవి వచ్చాయి. కానీ, ఓటమి పాలై నిరాశ చెందాయి.
సెమీస్ బెర్తులు..
భారత్‌కు ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. అయితే, పాకిస్థాన్‌కి కూడా కొన్ని సమీకరణాలు అనుకూలంగా మారాయి.
పాక్‌కి కూడా..
1992 ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై అద్వితీయ విజయం సాధించి తొలిసారిగా వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని పాకిస్థాన్ ఎగరేసుకుపోయింది. ఈసారి కూడా అలాగే జరుగుతుందని పాక్ అభిమానులు భావిస్తున్నారు.
ఛాంపియన్..
ఈ వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. కానీ, గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. 1992లో కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా వచ్చి గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.
ఆసీస్ పరాభవం
పాక్‌తో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఇప్పుడు సెమీస్ రేసులో ఉన్నాయి. 1992లోనూ ఈ మూడు జట్లు సెమీస్ రేసులో ఉండటం గమనార్హం.
1992లోనూ..
ఫైనల్ మ్యాచ్‌కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక కానుంది. 1992లో పాక్ గెలిచినప్పుడు కూడా ఫైనల్ వేదిక ఇదే. దీంతో భారత అభిమానుల్లోనూ స్వల్ప అలజడి రేగుతున్నట్లు కనిపిస్తోంది.
మెల్‌బోర్న్..
ఈ సెంటిమెంట్లు రిపీట్ అవుతాయని కొందరు ఊహిస్తుంటే.. క్రికెట్‌లో ఇలాంటి సారూప్యతలు కనిపించడం సర్వసాధారణమనేది విశ్లేషకుల మాట. ఏదైతేనేం ఇండియా టైటిల్ గెలిస్తే మనకదే చాలు!