T20WC: ఫైనల్‌కు దూసుకెళ్లిన

YouSay Short News App

పాకిస్థాన్‌

సూపర్‌ 12 మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, మరో ఓపెనర్‌ రిజ్వాన్‌ అర్ధశతకాలతో చెలరేగిన వేళ న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ పాక్ ఫైనల్‌ చేరింది.

బౌలింగ్‌ పరంగా బలమైన రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లు, బ్యాటర్లు పైచేయి సాధించారు.

నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికాకు షాక్‌ ఇవ్వడంతో అనూహ్యంగా సెమీస్‌కు చేరిన పాకిస్థాన్, 13 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

తొలుత టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా తొలి ఓవర్ రెండో బంతికే LBW నుంచి తప్పించుకున్న ఫిన్‌ ఆలెన్ ఆ తర్వాత బంతికే షాహీన్ అఫ్రీదికి వికెట్ల ముందు చిక్కాడు

ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌, డివాన్ కాన్వేను మరో 4 ఓవర్లపాటు పాక్‌ బౌలర్లు కట్టడి చేశారు. 6వ ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌కు ప్రయత్నించిన కాన్వే 21(20)ను షాదాబ్ అద్భుత త్రో వేసి రనౌట్‌ చేశాడు.

వరల్డ్ కప్‌లో ఇప్పటికే ఓ సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్న గ్లెన్‌ ఫిలిప్‌, 8వ ఓవర్లో మహ్మద్‌ నవాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి  6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.

డరైల్‌ మిచెల్‌, కేన్ విలియమ్సన్‌తో కలిసి అడపా దడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో 16వ ఓవర్‌ తొలి బంతికి రనౌట్‌ నుంచి తప్పించుకున్నాడు.

ఆ తర్వాతి ఓవర్‌లోనే షాహీన్‌ అఫ్రీదీ క్రీజులో పాతుకుపోయిన కేన్‌ విలియమ్సన్‌ 46(42)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

19వ ఓవర్‌ చివరి బంతికి  డరైల్‌ మిచెల్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

20 ఓవర్లో 8 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ 152-4 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. పాక్ బౌలర్లలో షాహీన్‌ అఫ్రీదీ 2, నవాజ్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

ఛేదనలో బౌల్ట్‌ వేసిన మ్యాచ్‌  తొలి ఓవర్‌ నాలుగో బంతికే  బాబర్‌ అజామ్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ డివాన్ కాన్వే దానిని నేలపాలు చేశాడు.

ఆ తర్వాత  న్యూజిలాండ్‌ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా రిజ్వాన్, బాబర్‌ 9 ఓవర్లు  చెలరేగి ఆడి జట్టు స్కోరును 75 పరుగులకు తీసుకెళ్లారు.

10వ ఓవర్‌లో తొలి బంతికి బాబర్‌ను రనౌట్‌ చేసే అవకాశాన్ని కూడా న్యూజిలాండ్‌ చేజార్చుకుంది

11వ ఓవర్‌ చివరి బంతికి బాబర్‌ అజామ్‌ ఈ టోర్నమెంట్‌లో తొలి అర్ధశతకాన్ని 38 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ఇండియాపై 0(1), జింబాబ్వేపై 4(9), నెదర్లాండ్స్‌పై 4(5), సౌతాఫ్రికాపై 6(15), బంగ్లాదేశ్‌పై 25(33) చేశాడు.

బౌల్ట్‌ వేసిన 13వ ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌ కోసం ప్రయత్నించిన బాబర్‌  53(42) మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 105 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు బ్రేక్‌ పడింది.

14 ఓవర్లో రిజ్వాన్‌ 36 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

స్కోరు బోర్డు నెమ్మదిగా కదులుతున్న సమయంలో పాక్‌ విజయానికి ఇంకా 22 పరుగులు కావాల్సిన వేళ 17వ ఓవర్‌ చివరి బంతికి క్రీజులో కుదుర్కున్న రిజ్వాన్‌ 57(43) బౌల్ట్‌ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

22 పరుగులు కావాల్సిన వేళ 18 ఓవర్లో ఫెర్గూసన్‌ను 4, 6 బాదిన హారిస్‌ సమీకరణాన్ని 2 ఓవర్లలో 8గా చేశాడు. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే మ్యాచ్‌ను ఫినిష్‌ చేద్దామనే తొందరలో శాంటర్న్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు.

చివరి ఓవర్‌లో 2 పరుగులతో విజయం సాధంచిన పాక్‌, 15 ఏళ్ల తర్వాత తొలిసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది.

రేపు ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే ఫైనల్‌లో దాయాది పోరు ప్రపంచ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసే సువర్ణవకాశం ముందుంది