ws_Snapinsta.app_1080_325743007_1159443761375868_2590311701100167771_n

YouSay Short News App

తమన్నా, విజయ్ వర్మ ప్రేమాయణం.. పరిచయం అక్కడేనంట?

తమన్నా, విజయ్ వర్మ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని,  డేటింగ్‌ చేస్తున్నారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ws_Snapinsta.app_1080_323929959_188449720500888_9176169439640416062_n

వీరిపై వచ్చేవి రూమర్స్‌ అని కొట్టి పారేయడానికి లేదు. న్యూ ఇయర్‌లో ముద్దు పెట్టుకోవటం నుంచి ముంబైలో చక్కర్లు కొట్టే వరకు అన్ని సాక్ష్యాలుగా చూపుతున్నారు. వీళ్ల రిలేషన్‌ ఎలా మెుదలయ్యిందో చూద్దాం.

ws_Snapinsta.app_1080_323806649_496330899288246_6509123001609620964_n

అలా మెుదలైంది

తమన్నా భాటియా, విజయ్ వర్మ మెుదటిసారి లస్ట్‌ స్టోరీస్‌ 2 సిరీస్‌లో నటించారు.ఈ వెబ్ సిరీస్‌ కోసం ఆరు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారట. ఇక్కడే వీరికి పరిచయం ఏర్పడిందని టాక్.

ప్రేమగా పరిచయం

షూటింగ్ ముగిసిన తర్వాత కూడా వీళ్లు తరచూ కలుసుకున్నారని ప్రచారం జరుగుతోంది.  ఆ పరిచయమే ప్రేమగా మారిందని అంటున్నారు.

ముద్దుతో న్యూఇయర్

విజయ్ వర్మ న్యూఇయర్ వేడుకల్ని మిల్కీ బ్యూటీతో గోవాలో జరుపుకున్నారు.ఫుల్‌గా ఎంజాయ్ చేయటమే కాదు ఘాటుగా ముద్దు కూడా పెట్టుకున్నారు ఈ జంట. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ముచ్చటగా మరోసారి

ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుందనే చర్చ జరుగుతుండగానే ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరూ సందడి చేశారు.విజయ్‌తో కలిసి తమన్నా ఫొటోలు దిగడం చర్చకు దారితీసింది.

అంతటితో ఆగలేదు

నిజంగానే డేటింగ్‌లో ఉన్నారు అనేంతలా దర్శనమిచ్చారు ఇద్దరు. ముంబయి రోడ్లపై ఒకే కారులో చక్కర్లూ కొడుతూ మీడియాకు చిక్కారు.

ఉలుకు పలుకు లేదు

సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి గురించి ఇంత జరగుతున్నా ఎవ్వరూ ఖండించలేదు.ప్రతి విషయాన్ని క్లారిటీ ఇచ్చే తమన్నా కూడా స్పందించకపోవటంతో నిజమనే భావిస్తున్నారు.

అలాంటిదేమీ లేదట?

తమన్నా, విజయ్ వర్మ గురించి తెలిసిన సన్నిహితులు మాత్రం రూమర్స్‌ను కొట్టిపారేస్తున్నారు. వారు మంచి స్నేహితులు మాత్రమే అని చెబుతున్నారు.

తెలిసిన వాడే

మిల్కీని ముద్దు పెట్టుకున్నది ఎవరిని నెటిజన్లు చాలామందే వెతికారు. అతడు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తి. నాని హీరోగా చేసిన MCA చిత్రంలో విలన్‌గా చేశాడు విజయ్ వర్మ.