TAPSEE PANNU:  నీలం రంగు చీరకట్టి… నాభి చుట్టు గొలుసు పెట్టిన సొట్ట బుగ్గల సుందరి

YouSay Short News App

సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పొన్ను ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకి వచ్చింది. చీరకట్టులో అందాల కనువిందు చేసింది  ఈ అమ్మడు.

పాలవన్నెల పరువాలు ప్రదర్శిస్తూ షేక్ చేసింది ముద్దుగుమ్మ. నగుమోము వయ్యరాలను ఒలకబోస్తూ యువతకు మత్తెక్కిస్తోంది.

నీలం రంగు చీరకట్టి… నాభి చుట్టూ గొలుసు పెట్టి…సింగారించింది చిన్నది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.

రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝమ్మంది నాదంతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే ఆకట్టుకుంది.

అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది దిల్లీ భామ.

Mr. పర్‌ఫెక్ట్‌, సాహసం, కాంచన 2, ఘాజీ, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్‌ బాట పట్టింది తాప్సీ. పింక్, నామ్‌ శభానా, బద్లా వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది.

సినిమాల్లోనే కాకుండా వ్యాపారిగానూ రాణిస్తుంది ఈ బ్యూటీ. పూణే 7 Aces బ్యాడ్మింటన్‌ ఫ్రాంఛైజీకి యజమాని. అంతేకాదు, వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ సంస్థను కూడా నడిపిస్తోంది.

ఇటీవల మిషన్ ఇంపాజిబుల్‌ చిత్రంతో తెలుగులో మెరిసింది తాప్సీ. షారుఖ్ ఖాన్‌తో డుంకీ, ఏలియన్, ఓ లడ్కీ హై కహాన్ అనే చిత్రాల్లో నటిస్తుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran