Taraka Ratna: తారకరత్నకు ప్రముఖుల నీరాజనం

YouSay Short News App

నందమూరి తారకరత్న మరణంతో సినీ, రాజకీయ రంగం శోకసంద్రంలో మునిగిపోయింది.  పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తారకరత్న పార్థివదేహం వద్ద కన్నీరుమున్నీరు అయ్యారు.

సినిమాలు, వినోద రంగంలో తారకరత్న తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. ఓం శాంతి- ప్రధాని నరేంద్ర మోదీ

నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి మా కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చాడు. తిరిగి వస్తాడనుకున్నా- చంద్రబాబు

తారకరత్న లాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా- చిరంజీవి

నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితం గడపాలని ఆయన భావించారు. తారకరత్న ఆశయం నెరవేరకుండానే వెళ్లిపోవడం బాధాకరం- పవన్ కళ్యాణ్

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరం- కిషన్ రెడ్డి

సోదరా నీ అకాల మరణం నన్నెంతో బాధించింది. నా ఆలోచనలన్నీ నీతోనే- మహేశ్ బాబు.

సోదరుడి మృతి వార్త విని హృదయం చలించింది. త్వరగా మనల్ని వదిలి వెళ్లడం బాధాకరం- అల్లు అర్జున్

నా వెన్నంటి ఉండి నడిచిన తారకరత్న అడుగుల చప్పుడు ఆగిపోవడం తీవ్ర వేదనకు గురిచేసింది- నారా లోకేశ్

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా నివాళులు అర్పించారు.

సంపూర్ణ ఆరోగ్యంతో మన మధ్యలోకి తిరిగి వస్తారని భావించాను. చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం- వెంకయ్య నాయుడు

చిన్న వయసులోనే కన్ను మూయడం బాధాకరం. ఆయనో డైనమిక్ పర్సన్. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి- వెంకటేశ్

ఎన్టీఆర్ మనవడిని అనే అహంకారం ఉండేది కాదు. మంచి మానవతావాదిని కోల్పోవడం బాధాకరం- పోసాని కృష్ణ మురళి

తారకరత్న భౌతికకాయానికి ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.