TARAKARATNA: నందమూరి ఫ్యామిలీని వెంటాడుతున్న నెంబర్ లాజిక్.. 9, 23 అస్సలు పడట్లేదు..!

YouSay Short News App

తారకరత్న అకాల మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న తుది శ్వాస విడిచారు.

23రోజుల పాటు తారకరత్న చికిత్స పొందారు. అదేంటో గాని ఈ ‘23’ నెంబర్ నందమూరి కుటుంబానికి కలిసి రావట్లేదు. మరో నెంబర్ ‘9’ కూడా వీరికి చేదు అనుభవాన్ని మిగుల్చుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఇండస్ట్రీకి వచ్చీరాగానే ఒకేసారి 9 సినిమాలు ప్రారంభించాడు తారకరత్న. అప్పట్లో ఇది రికార్డ్‌గా నిలిచింది. కానీ ఇందులో కొన్ని సినిమాలే విడుదలయ్యాయి.

జనవరి 27న ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కుప్పకూలిపోయాడు. అంటే 2+7=9. 9 అంకె మళ్ళీ కలిసి రాలేదని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 18. తారకరత్న మరణించిన రోజు. 1+8=9. అలా ప్రమాదానికి, మరణానికి యాధృచ్ఛికంగా ‘9’వ నెంబర్‌తో లంకె పడింది.

తారక‌రత్నకే కాదు.. ఈ ‘9’ నెంబర్ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లకు కూడా కలిసి రాలేదు.

1996 జనవరి 18న సీనియర్ ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు. 1+8=9. ఇక్కడా ‘9’వ అంకె ఘోచరిస్తోంది.

2009 మార్చి 27న జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 2+7=9. ఇలా నెంబర్ ‘9’ జూ.ఎన్టీఆర్‌కి కూడా చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.

తారకరత్న 9 అవర్స్ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించాడు. ఇందులోని ఎపిసోడ్‌ల సంఖ్య కూడా తొమ్మిదే.

గుండెపోటు అనంతరం 23 రోజుల పాటు తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నెంబర్‌తో కూడా కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి.

నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన కారు నెంబర్ 2323 కావడం గమనార్హం.

నందమూరి హరికృష్ణ కూడా హైవే ప్రమాదంలో హఠాణ్మరణం చెందారు. యాధృచ్ఛికంగా ఈ వాహనం నెంబర్ కూడా 2323నే.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెల్చుకున్న సీట్ల సంఖ్య 23.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెల్చుకున్న సీట్ల సంఖ్య 23.

నారా లోకేష్ పుట్టినరోజు తేదీ కూడా 23. లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొన్నపుడే తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఈ నెంబర్ చర్చకు దారితీసింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.