2023 హుందాయ్‌ను దాటేయనున్న టాటా

YouSay Short News App

భారత ఆటో మెుబైల్ రంగానికి 2022 కలిసొచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అమ్మకాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

మారుతి, టాటా, మహింద్రా వంటి సంస్థలు టాప్‌ 5లో నిలిచాయి. విదేశీ కంపెనీలైన హుందాయ్‌, టొయోటా, హోండా, రెనాల్ట్, నిస్సాన్‌, జీప్‌ వంటి సేల్స్‌ 2022లో పడిపోయాయి.

2022లో ఏ కంపెనీ అత్యధికంగా వాహనాలు విక్రయించిందో ఓసారి చూద్దాం.

మారుతి

మార్కెట్‌లో మారుతి కంపెనీ తన ప్రత్యర్థులకంటే ముందంజలోనే కొనసాగుతోంది. ఈ దేశీయ సంస్థ 2022లో 41 శాతం సేల్స్‌ షేర్‌తో దాదాపు 15.75 లక్షల కార్లను విక్రయించిందని సమాచారం.

హుందాయ్‌

సౌత్‌ కొరియాకు చెందిన ఈ ఆటోమెుబైల్‌ సంస్థ విక్రయాల్లో రెండోస్థానంలో నిలిచింది. స్వల్ప తేడాతో టాటాను వెనక్కి నెట్టింది. 2022లో సుమారు 5.5 లక్షల కార్లను విక్రయించిందని టాక్. ఈ ఏడాది మార్కెట్‌లో హుందాయ్‌ వాటా 2 శాతం తగ్గింది.

టాటా మోటార్స్‌

గత కొన్ని సంవత్సరాలుగా టాటామోటార్స్ మళ్లీ పుంజుకుంది. 2022లో 13.9 % శాతం సేల్స్‌ షేర్‌తో 5.25 లక్షల కార్లను అమ్మింది.

2023 కల్లా హుందాయ్‌ను దాటేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. టాప్‌ 2 కంపెనీలతో పోలిస్తే టాటా మోటార్స్‌  మార్కెట్‌ విలువ 3% పెరిగింది.

మహీంద్రా

భారత్‌కు చెందిన మరో దిగ్గజ సంస్థ. 2022లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. సుమారు 3.35 లక్షల కార్లను 8.86% సేల్స్ షేర్‌తో విక్రయించారట.

మహీంద్రా మార్కెట్‌ షేర్‌ కూడా 2.23 % పెరిగింది. మెుదటి 8 కంపెనీల అమ్మకాల్లో టాప్‌ ర్యాంక్ నమోదు చేసింది.

కియా

భారత మార్కెట్‌లోకి కొత్తగా వచ్చినప్పటికీ కియా సేల్స్‌ విపరీతంగా ఉన్నాయి. 2022లో 6.73% సేల్స్‌ షేర్‌తో 2.5 లక్షల కార్లు అమ్మారు. మార్కెట్‌ షేర్‌  0.76 శాతం పెరిగిందంట.

టొయోటా

జపాన్‌కు చెందిన టొయోటా 2022లో దాదాపు 1.6 లక్షల వాహనాలు విక్రయించింది. మార్కెట్‌లో దీనివాటా 4.24 శాతం.

గణాంకాలు బాగానే ఉన్నా.. ఇది ప్రీమియం వాహన విక్రయదారు కావటంతో మార్కెట్‌ షేర్‌ కొద్దిగా పడిపోయింది.

హోండా

ఈ జపనీస్‌ ప్రీమియం కార్ల తయారీ సంస్థ 2022లో 95 వేల కార్లను అమ్మింది. సేల్స్‌ షేర్‌ 2.51 %. హోండా మార్కెట్‌ షేర్‌ కూడా ఈ ఏడాది పడిపోయింది.

రెనాల్ట్‌

ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్‌కు 2022 అస్సలు కలిసిరాలేదు. ఇది కేవలం 81 వేల కార్లను మాత్రమే విక్రయించింది. 2021తో పోలీస్తే దాదాపు 15 శాతం తక్కువ. కానీ, మెుత్తం మార్కెట్‌ షేర్‌ 1%  పడిపోయింది.

స్కోడా

ఈ ప్రీమియం వాహనాల తయారీ సంస్థకు 2022 గొప్ప ఏడాది. విక్రయాలు జోరుగా సాగాయి. దాదాపు 53 వేల కార్లు అమ్మారు.

గతేడాదితో పోలిస్తే ఇది 125 % అధికం. సేల్స్‌ షేర్‌ 1.42 శాతం పెరగటంతో మార్కెట్‌ షేర్‌ కూడా గణనీయంగా పెరిగింది.

MG (మోరిస్ గరాజ్ )

MG సేల్స్‌ కూడా 2022లో బాగానే ఉన్నాయి. దాదాపు 48 వేల కార్లు అమ్మినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఇది 19% అధికమని సమాచారం. భారత్‌లో MG సేల్స్ షేర్ 1.27% .