YouSay Short News App

Tattoos: హీరోయిన్ల సొగసులపై టాటూలు.. వాటి అర్థం తెలుసా?

సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లకు టాటూలు మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. తమలోని భావాలను, ఇష్టాలను వీటిద్వారా వ్యక్తపరుస్తుంటారు. మరి ఆ టాటూ ముద్దుగుమ్మలెవరో చూసేద్దామా.

సమంత శరీరంపై మొత్తంగా 3 టాటూలుంటాయి. ఇందులో ఒకటి వీపు భాగంలో ‘ymc’ అని డిజైన్ చేసి ఉంటుంది. తొలి సినిమా ‘ఏ మాయ చేసావే’కి గుర్తుగా ఈ టాటూ వేసుకుందట.

సమంత

కుడిచేతిపై వికింగ్ సింబల్, కుడివైపు పక్కటెముకలపై ‘చై’ అని మరో టాటూ ఉంటుంది.

క్యూట్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ చేతితో పాటు నడుముపైనా పువ్వు గుర్తులను టాటూగా వేసుకుంది. ఇవి ఈ ముద్దుగుమ్మకు మరింత అందాన్ని పెంచాయి.

కాజల్ అగర్వాల్

అనసూయకు రెండు టాటూలున్నాయి. ఒకటి ఎద భాగంలో ఎడమవైపు ఉంటే, మరొకటి ఎడమచేతిపై రాసి ఉంటుంది.

అనసూయ

చాతీపై ‘నిక్కూ’ అని రాసి ఉంటుంది.  అది అనసూయ భర్త భరద్వాజ్ ముద్దు పేరు.

అలాగే చేతిపై కాలోన్ అని రాసి ఉంటుంది.  దీనికి అంతర్గత సౌందర్యం అనే అర్థం వాడుకలో ఉంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కుడిచేతిపై ‘Irreplaceable’ అనే టాటూ ఉంటుంది.  ఈ ప్రపంచంలో ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని దానర్థం. మహిళలు దేన్నైనా భరించగలరని నిరూపించడానికి ఈ టాటూ వేయించుకుందట.

రష్మిక మందన్న

శ్రుతిహాసన్ ఎడమ భుజంపై ఉండే టాటూ ఆకట్టుకుంటుంది. తమిళంలో తన పేరును అచ్చు వేయించుకుందీ భామ. చేతిపై కూడా శ్రుతికి టాటూ ఉంటుంది.

శ్రుతిహాసన్

టాటూలంటే త్రిషకు మహా ఇష్టం. చాతిపై ఉన్న ‘నీమో’ టాటూ ఒక డిస్నీ క్యారెక్టర్. చేతిపై తన జొడియాక్ సైన్. మరొకటి వీపుపై ఉంటుంది. ట్రై పాడ్‌పై కెమెరా, అందులోనే క్లాప్ బోర్డు గుర్త ఉంటుంది.

త్రిష

తాప్సి ఎడమభుజానికి సమీపంలో టాటూ ఉంటుంది. ఓ పక్షి తన రెక్కలు విప్పుతూ స్వేచ్ఛా జీవిలా విహరించడంలా ఈ టాటూ కనిపిస్తుంది. పింక్ సినిమా సమయంలో ఈ టాటూతో కనిపించింది.

తాప్సి

‘హం’ అనే బుద్దిజం సింబల్ ఉంటుంది. విద్వేషాలను వదిలి ప్రేమ, దయ, రక్షణలను కల్పించాలని దాని అర్థం.

అను ఇమ్మాన్యుయేల్

ఎడమచేతిపై నయనతారకు మొదట్లో ‘ప్రభు’ అనే టాటూ ఉండేది. ప్రస్తుతం అది ‘పాజిటివిటీ’గా మారింది.

నయనతార

లెజెండ్ భామ సోనాల్ చౌహాన్ కుడి భుజంపై టాటూ ఉంటుంది. అదొక ఈగల్ గుర్తును పోలి ఉంటుంది. మొదట్లో దీన్ని స్టిక్కర్ అని భావించడం గమనార్హం.

సోనాల్ చౌహాన్

కుడిచేతిపై దేవనాగరి లిపిలో ‘గౌతమ్, సితారా,మహేశ్ బాబు’ అని రాసి ఉంటుంది.

నమ్రత శిరోద్కర్

పవన్ కళ్యాణ్‌‌ని విస్తృతంగా ఆరాధించే నటి అశు రెడ్డి. అందుకే తన పక్కటెముకలపై పవన్ కళ్యాణ్ పేరును టాటూ వేయించుకుంది. రెండు చేతులపైనా ఈ బ్యూటీకి టాటూలున్నాయి.

అశు రెడ్డి