YouSay Short News App

టీ 20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది మనోళ్లే… సూర్య కుమార్ ప్లేస్ ఎంతంటే?

టీమిండియా Mr.360 సూర్యకుమార్ యాదవ్‌ క్రికెట్‌లో ఓ సంచలనం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు మాత్రం ఎన్నో ఉన్నాయి.

ప్రస్తుతం పరుగుల వరద పారిస్తున్న ఈ క్రికెటర్ టీ 20ల్లో సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. 43 ఇన్నింగ్స్‌లో 92 సిక్సర్లు బాదాడు స్కై. భారత్‌ తరఫున రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ తర్వాత స్థానంలో నిలిచాడు. మరి అంతర్జాతీయంగా అత్యధిక సిక్సులు కొట్టింది ఎవరంటే ?

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ 20ల్లో అత్యధిక సిక్సులు కొట్టినవారిలో మెుదటిస్థానంలో ఉన్నాడు. 140 ఇన్నింగ్సుల్లో ఏకంగా 182 సిక్సులు కొట్టాడు హిట్‌ మ్యాన్‌.

రోహిత్‌ శర్మ

న్యూజిలాండ్‌ పవర్‌పుల్‌ ఓపెనర్‌గా పేరున్న మార్టిన్‌ గప్టిల్‌ 118 ఇన్నింగ్సుల్లో 173 సిక్సులు కొట్టాడు. రోహిత్‌  తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు ఈ కివీస్‌ బ్యాట్స్‌మెన్‌.

మార్టిన్ గప్టిల్‌

ఆస్ట్రేలియా టీ20 సారథి ఫించ్‌ కూడా సూపర్‌ షాట్లు ఆడగలడు. 103 మ్యాచుల్లో 125 బంతులను బౌండరీ రోప్‌ దాటించి మూడో ప్లేస్‌లో నిలిచాడు.

ఆరోన్‌ ఫించ్‌

గేల్‌ మామ బాల్‌ను అలవోకగా బౌండరీ దాటించగలడు. కేవలం 75 ఇన్నింగ్సుల్లో 124 సిక్సులు కొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు సిక్సర్ల వీరుడు.

క్రిస్‌ గేల్‌

ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మోర్గాన్‌ అత్యధిక సిక్సులు కొట్టిన వారిలో ఐదో స్థానం దక్కించుకున్నాడు. 107 ఇన్నింగ్సుల్లో 120 సిక్సెస్‌ బాదాడు ఈ ఫినిషర్.

మోర్గాన్‌

రన్‌ మిషన్‌ కోహ్లీ పేరిట లేని రికార్డు లేదు. 107 ఇన్నింగ్స్‌లో 117 సిక్సులు బాది ఆరోస్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ

ఐర్లాండ్‌లో అత్యంత దూకుడుగా ఆడే ఓపెనర్‌ స్టిర్లింగ్‌. వచ్చిన బంతిని బౌండరీకి పంపాలని చూసే పాల్‌… కోహ్లీతో సమానంగా 117 సిక్సులు కొట్టి 7వ ప్లేస్‌లో నిలిచాడు.

పాల్‌ స్టిర్లింగ్

వెస్టిండీస్‌ ఓపెనర్‌ లూయిస్‌ వీరోచితమైన ఆటగాడు. కేవలం 52 ఇన్నింగ్సుల్లో 111 బంతులను ప్రేక్షకుల్లోకి పంపించాడంటే అర్థం చేసుకోవచ్చు. టాప్‌ 10లో ఇతడిది 8వ స్థానం.

ఎవిన్ లూయిస్‌

బట్లర్‌ సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 108 సిక్సులతో 9వ ప్లేస్‌లో నిలిచాడు ఈ టీ 20 సారథి.

జోస్‌ బట్లర్‌

న్యూజిలాండ్‌కు చెందిన మున్రో వేగంగా పరుగులు సాధిస్తుంటాడు. 62 ఇన్నింగ్సుల్లోనే 107 సిక్సులు బాది 10వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

మున్రో

టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్ స్టైలే వేరు. మ్యాచ్‌ నెమ్మదిగా స్టార్ట్‌ చేసినా తర్వాత మెరుపులు మెరిపిస్తాడు. 68 ఇన్నింగ్సుల్లోనే 99 సిక్సులతో 14వ స్థానంలో ఉన్నాడు.

కేఎల్‌ రాహుల్‌

సూర్యకుమార్‌ టార్గెట్‌ బంతిని బౌండరీ దాటించడమే. ఫోర్స్‌ కన్నా ఎక్కువ సిక్సులే ఉంటాయి. అందుకే కేవలం 43 ఇన్నింగ్సుల్లోనే 92 సిక్సులు బాదాడు.

సూర్య కుమార్ యాదవ్‌

16వ స్థానంలో ఉన్నప్పటికీ అందరికన్నా తక్కువ మ్యాచుల్లో వేగంగా రికార్డులను చేరుకుంటున్నాడు.