టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?

YouSay Short News App

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఎన్నికైన అజిత్ అగార్కర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు ఉన్నాయి

2000లో జింబాబ్వేపై ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఆ రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు.

లార్డ్స్‌ మైదానంలో సెంచరీ బాదిన అతి కొద్దిమంది భారత క్రికెటర్లలో అగార్కర్ ఒకరు

2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అజిత్ అగార్కర్‌ 109(190) శతకం కొట్టాడు

వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో అతనిది మూడో స్థానం

టెస్టుల్లో వరుసగా 5 సార్లు డకౌట్‌ అయిన చెత్త రికార్డు అగార్కర్‌పైనే ఉంది. అది కూడా చెక్కు చెదరలేదు. ఈ ఐదు సార్లు ఆస్ట్రేలియా మీదనే కావడం గమనార్హం

వన్డేల్లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసి 100కుపైగా వికెట్లు పడగొట్టిన 10 మంది టీమిండియా ప్లేయర్స్‌లో అగార్కర్‌ ఒకడు.

ODIలో 1000 కంటే ఎక్కువ రన్స్ చేసి 50 వికెట్లు, 50 క్యాచ్‌లు అందుకున్న 8 మంది భారత క్రికెటర్లలో అజిత్ అగార్కర్‌ ఒకడు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran