మ్యాచ్ హైలెట్స్
134 పరుగుల లక్ష్యంతో సౌతాఫ్రికా బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు గట్టిగా బదులిచ్చారు.
అర్ష్‌దీప్ సింగ్ తన తొలి ఓవర్‌లో ఇన్‌స్వింగర్, ఔట్‌స్వింగర్‌లతో డీకాక్, రస్సోను పెవిలియన్ బాట పట్టించాడు
ఆ తర్వాత టెంబా బావుమాను కూడా 10 పరుగులకే షమీ ఔట్ చేశాడు
24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను మార్క్రమ్, మిల్లర్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు
9వ ఓవర్లో మిల్లర్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని హార్దిక్ పాండ్యా సద్వినియోగం చేసుకోలేకపోయాడు
ఆ తర్వాత 12వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో మార్క్రమ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను కోహ్లీ వదిలేశాడు
చెలరేగి ఆడిన మార్క్రమ్ అర్ధశతకం పూర్తిచేసుకున్నాక 16వ ఓవర్‌లో హార్దిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు
3 ఓవర్లలో 25 పరుగులు అవసరమైన వేళ అశ్విన్ బౌలింగ్‌లో మిల్లర్ 2 సిక్స్‌లు బాది సమీకరణం సులభం చేశాడు
చివరి 2 ఓవర్లకు 12 పరుగులు కావాల్సిన వేళ బౌలింగ్‌కు వచ్చిన షమీ కేవలం 6 పరుగులు ఇచ్చాడు
చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా మిల్లర్ (59) రెండు బౌండరీలతో సౌతాఫ్రికాను విజయతీరానికి చేర్చాడు
4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన లుంగి ఎంగిడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు
సౌతాఫ్రికా గెలుపుతో పాక్ సెమీస్ ఆశలు మరింత జఠిలమయ్యాయి. సౌతాఫ్రికా మరో మ్యాచ్ గెలిస్తే పాక్ సెమీస్ చేరడం చాలా కష్టమవుతుంది