వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆటగాళ్లు….

Floral Separator

ఎవరెలా ఆడారంటే..!

ఇంగ్లండ్‌తో ఘోర పరాజయం తర్వాత ఇంటిబాట పట్టిన టీమిండియా వరల్డ్‌ కప్‌ జర్నీలో అసలు ఒక్కో ఆటగాడు ఏ స్థాయి ప్రదర్శన చేశాడో చూద్దాం

చిన్న జట్లు, ఐపీఎల్‌లో మాత్రమే ఆడతాడనే విమర్శను నిజం చేశాడు. బంగ్లా, జింబాబ్వేలపై అర్ధశతకాలు మినహా మిగతా జట్లపై 50 పరుగులు కూడా చేయలేదు.

మ్యాచ్‌లు : 6

పరుగులు : 128

KL రాహుల్‌

ముంబయికి సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్‌, పరిమిత వనరులతో జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. పసికూన నెదర్లాండ్స్‌పై అర్ధశతకం మినహా బ్యాటర్‌గానూ నిరాశపరిచాడు.

మ్యాచ్‌లు : 6

పరుగులు : 116

రోహిత్‌ శర్మ

సరైన టైంలో ఫామ్‌ అందుకుని జట్టుకు వెన్నెముకలా మారాడు. ఆరింటిలో నాలుగు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలు చేశాడు. టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌పై ఇన్నింగ్స్ చరిత్రాత్మకం.

మ్యాచ్‌లు : 6

పరుగులు : 296

విరాట్‌ కోహ్లీ

వరల్డ్‌ నంబర్‌ 1 టీ20 బ్యాటర్‌గా తన సత్తా చాటాడు. విలక్షమైన ఆటతో ఓపెనర్ల దారుణ స్ట్రైయిక్‌ రేటును పూడుస్తూ..జట్టుకు అండగా నిలిచాడు. జింబాబ్వేపై ఆడిన ఇన్నింగ్స్‌ ప్రపంచమే అబ్బురపోయేలా చేసింది.

మ్యాచ్‌లు : 6

పరుగులు : 239

సూర్యకుమార్‌ యాదవ్‌

ఆల్‌రౌండర్లలో హార్దిక్‌ ఒక్కడే జట్టుకు కాస్త ఉపయోగపడ్డాడు. సెమీస్‌లో పాండ్యా లేకుంటే ఇప్పటికన్నా ఘోర పరాజయం చూడాల్సి వచ్చేది. పాక్‌పై 40 పరుగులు 3 వికెట్లతో చెలరేగాడు. జట్టులో వికెట్లలో రెండో స్థానం.

మ్యాచ్‌లు : 6

పరుగులు : 128

హార్దిక్‌ పాండ్యా

వికెట్లు : 8

ఆల్‌ రౌండర్‌ అన్న ఒకే ఒక్క కారణంతో 5 మ్యాచులూ ఆడించారు కానీ, బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎందులోనూ ఆకట్టుకునే ప్రదర్శన లేదు. చాహల్‌ను ఆడిస్తే కనీసం వికెట్లైనా దక్కేవేమో.

మ్యాచ్‌లు : 6

పరుగులు : 21

రవిచంద్రన్‌ అశ్విన్‌

వికెట్లు : 6

మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే బాధ్యతను ఏమాత్రం నెరవేర్చలేకపోయాడు. జింబాబ్వేపై 3 వికెట్లు తప్ప టోర్నీ మొత్తంలో పెద్దగా సాధించిందేమీ లేదు. సెమీస్‌లో కీలక పాత్ర పోషించాల్సిన వేళ చేతులెత్తేశాడు.

మ్యాచ్‌లు : 5

పరుగులు : 9

అక్షర్‌ పటేల్‌

వికెట్లు : 3

సూపర్‌ ఫినిషనర్‌ అని తీసుకుంటే అత్యంత పేలవమైన ప్రదర్శన చేశాడు. మూడు సార్లు బ్యాటింగ్‌ అవకాశమొస్తే ఒక్క దానిని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కీపర్‌గానూ అద్భుతమైన వికెట్లు అందించిందేమీ లేదు.

మ్యాచులు : 4(3 ఇన్నింగ్స్)

పరుగులు : 14

దినేశ్‌ కార్తిక్‌

ఇంగ్లండ్‌పై మినహా టోర్నీ మొత్తం పొదుపుగానే బౌలంగ్ వేసినా వికెట్ల పరంగా మాత్రం పెద్దగా జట్టుకు ఉపయోగపడలేదు. పవర్‌ప్లే బౌలర్‌గా భువి నుంచి జట్టు వికెట్లు కోరుకుంటుంది. కానీ అది జరగలేదు.

మ్యాచులు : 6

వికెట్లు : 4

భువనేశ్వర్‌ కుమార్‌

సీనియర్‌ బౌలర్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిన షమీ, ఏ రకంగానూ ఉపయోగపడలేదు. వికెట్లు తీయలేదు. పైగా పరుగులు కూడా ధారాళంగానే సమర్పించుకున్నాడు.

మ్యాచులు : 6

వికెట్లు : 6

షమీ

భువీ, షమీ, అశ్విన్‌ లాంటి సీనియర్లంతా నిరాశ పర్చిన చోట భవిష్యత్‌ ఆశాకిరణంలా అర్షదీప్‌ ఆడాడు. తొలి ఓవర్లలోనే వికెట్లు అందిస్తూ ఈ టోర్నీలో బౌలింగ్‌ను ముందుండి నడిపించాడు.

మ్యాచులు : 6

వికెట్లు : 10

అర్ష్‌దీప్‌ సింగ్‌

పంత్‌: ఆడింది రెండు మ్యాచ్‌లే కాబట్టి పెద్దగా చర్చించలేం. కానీ,  కీలక సమయాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.