Telangana Secretariat:  డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయం విశేషాలు తెలుసా?

YouSay Short News App

తెలంగాణ సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంగా నామకరణం చేశారు.

హుస్సేన్ సాగర్ తీరాన మొత్తం 28ఎకరాల్లో సచివాలయం నిర్మితమైంది. 10.51లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాప్తించి ఉంది.

మొత్తం 11 అంతస్థులున్నాయి. ఒక్కో అంతస్థు  14 అడుగుల ఎత్తును కలిగి ఉండటం విశేషం. సచివాలయం పూర్తి ఎత్తు 265 అడుగులు.

తొలి రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థికశాఖ కార్యకలపాలు సాగనున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్టోర్ రూం, స్టాఫ్ రూమ్స్ ఉంటాయి.

3 నుంచి 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు ఉంటాయి. ఆయా శాఖల కార్యకలపాలు సాగనున్నాయి. 7 నుంచి 11 అంతస్తుల్లో గుమ్మటాలు ఏర్పాటు చేశారు.

ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం ఉండనుంది. ఇందులో 30 కంపార్ట్‌మెంట్లు ఉండనున్నాయి.

సచివాలయానికి మొత్తం నాలుగు గేట్లు ఉన్నాయి. లుంబినీ పార్కు ఎదుటనున్న గేటు నుంచి సీఎం వెళ్తారు. ఎన్టీఆర్ గార్డెన్ ముందున్న గేటు నుంచి ఉద్యోగులు, సిబ్బంది లోనికి వస్తారు. బిర్లామందిర్ వైపు నుంచి సామాన్యులకు ఎంట్రీ. ఇక నాలుగోది ఎమర్జెన్సీ గేటు.

వాస్తు ప్రకారం ప్లానింగ్ జరిగింది. తెలంగాణ సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా డిజైన్‌ని తీర్చిదిద్దారు. తూర్పు దిశలో ప్రధాన ప్రవేశ ద్వారం ఉండేలా రూపొందించారు.

సచివాలయ భవనానికి మొత్తం 34 గుమ్మటాలు అమర్చారు. రెండు ప్రధాన గుమ్మటాలు(తూర్పు, పడమరలో) ఉన్నాయి. వీటిపై 18 అడుగుల జాతీయ చిహ్నాన్ని అమర్చారు.

సీఎం, మంత్రులు, సిబ్బంది, సామాన్యులకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం ఉంది. పార్కింగ్ కోసం 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కేటాయించారు.

డిస్పెన్సరీ, ఏటీఎం, బ్యాంకు, ఫిల్లింగ్ స్టేషన్, ఫైర్ స్టేషన్, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి.

2019 జూన్‌లో నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కరోనా మహమ్మారి వల్ల నిర్మాణం ఆలస్యమైంది. దాదాపు రూ.600 కోట్లు ఖర్చయింది.

పనులు 100శాతం పూర్తి కానందున ఫిబ్రవరి 17న సీఎం ఛాంబర్ ఒక్కటే కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగతా కార్యాలయాలు ఓపెన్ అవుతాయి.