తెలుగు సినీ పరిశ్రమకు 2022 బాగానే కలిసి వచ్చింది. నాగార్జున బంగార్రాజుతో మెుదలైన వసూళ్ల దూకుడు డీజే టిల్లుతో మార్మోగింది.
దర్శకధీరుడు జక్కన్న రామ్, భీమ్‌లతో కలిసి చేయించిన ఆర్ఆర్‌ఆర్ పోరాటాలు వెయ్యి కోట్ల మార్క్ వైపు నడిపించాయి.
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2, లోకేశ్ కనగరాజ్ విక్రమ్ లాంటి పరభాషా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. బింబిసార, ఒకే ఒక జీవితం ప్రేక్షకుల్ని టైమ్ ట్రావెల్ చేయించాయి.
సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ ప్రేమకథా చిత్రానికి కాసుల వర్షం కురిసింది. కార్తీకేయ 2తో నిఖిల్ బాలీవుడ్‌నే షేక్ చేయగా..అడవి శేష్ మేజర్,
హిట్ 2 థ్రిల్లర్స్ అలరించాయి.
తెలుగు పరిశ్రమకు సంక్రాంతితోనే సక్సెస్ ప్రారంభమయ్యింది. నాగార్జున, నాగచైతన్య బంగార్రాజుతో సోలో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టారు. కోటితో తీసిన సినిమాకు రూ. 60 కోట్లు వచ్చాయి.
సంక్రాతి సక్సెస్
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సిద్దూ జొన్నల గడ్డ చిత్రం డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అయ్యింది. టిల్లు అన్న డీజే రూ.కోటితో తెరకెక్కితే రూ. 20 కోట్లు రాబట్టింది
డీజే టిల్లు ఫీవర్
కుమురం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రల స్ఫూర్తితో ఆర్ఆర్ఆర్ చిత్రం తీర్చిదిద్దిన రాజమౌళి మరో భారీ హిట్ కొట్టాడు. రూ. 550 కోట్లు పెడితే రూ.1111.7 కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించింది.
విభిన్న కథలకు కెరాఫ్ అడ్రస్ అయిన అడివి శేష్.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ సినిమా తీశారు. విక్రమ్ నుంచి
గట్టిపోటీ ఉన్నా రూ. 58 కోట్లు వసూలు
చేసింది.హిట్2
మేజర్ సెల్యూట్
హిట్ యూనివర్స్‌లో శేష్ తీసిన హిట్ 2 థ్రిల్లర్ మెప్పించింది. రూ. 10 కోట్లతో నిర్మిస్తే రూ. 50 కోట్లు సంపాదించింది.
ఏళ్లుగా భారీ హిట్ కోసం చూస్తున్న కమల్ హాసన్‌కు లోకేశ్ కనగరాజ‌్ తన సినిమాటిక్ యూనివర్స్‌లో విక్రమ్‌తో కానుక ఇచ్చాడు. ఈ సినిమా రూ. 500 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.
పదా చూసుకుందాం
ప్రేమకథా చిత్రం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు హను రాఘవపూడి సీతారామం అందించారు. దీంతో రూ.30 కోట్లతో రూపొందించితే రూ. 91.4 కోట్ల కాసుల వర్షం కురిసింది.
యుద్ధంతో రాసిన ప్రేమకథ
బింబిసార ఫ్రాంఛైజీ మెుదటి భాగంతో కల్యాణ్ రామ్ చరిత్రలోకి తీసుకెళ్లారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ కొట్టిన ఈ సినిమా బడ్జెట్ రూ. 40 కోట్లు. కానీ కలెక్షన్లు రూ. 64.57 కోట్లు.
టైం ట్రావెల్స్
అమ్మ సెంటిమెంట్‌తో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాలంలో వెనక్కి వెళ్లే కథతో అలరించాడు. రూ. 12 కోట్లతో తీస్తే రెట్టింపు వచ్చింది.
తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ రికార్డులు తిరగరాసిన సినిమా కార్తీకేయ 2. నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా హిందీలో 53 థియేటర్లలో రిలీజ్ అయ్యి ఐదు రోజుల్లో 1500లకు చేరింది. రూ. 15 కోట్లతో వచ్చి రూ. 120 కోట్లు కొల్లగొట్టింది.
బాలీవుడ్ బాద్‌షా
రిషబ్ షెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన కాంతారా ఓ ప్రభంజనం. విడుదలైన అన్ని చోట్ల హిట్ కొట్టింది. రూ. 16 కోట్ల బడ్జెట్ కాగా రూ. 400 కోట్లకు పైనే వచ్చాయి.
ఓ.....కాంతారా
లూసిఫర్ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి మెప్పించాడు. గాడ్ ఫాదర్‌తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
చిరు హిట్ ట్రాక్
మయోసైటిస్‌తో బాధపడుతూ డబ్బింగ్ చెప్పిన సమంత ‘యశోద’ హిట్ సాధించింది. బుల్లితెర సూపర్ స్టార్ సుధీర్ నటించిన గాలోడు బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేసింది. మసూద, లవ్ టుడే వంటి చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి.