ఏపీలో టికెట్ ధరల పెంపు. కొద్ది రోజులకే నిర్మాతల తగ్గింపు. ఓటీటీల పుణ్యం మధ్య తరగతి వారికి కాస్త ఆలస్యం. ఎన్టీఆర్ పాతికేళ్ల సినీ ప్రస్థానం. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు అస్తమయం. ఇలా మంచి, చెడులతో కలగలిసి ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయాణం చూడండి.
‘మా’ ఎన్నికలు గతేడాది అక్టోబర్‌లో జరిగినప్పటికీ దాని ప్రభావం 2022 వరకు కొనసాగింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రకాశ్ ప్యానెల్ రాజీనామాలు చేసి తప్పుకుంది.
‘మా’ ఎన్నికలు
ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను పూర్తిగా తగ్గించ
ఆన్ లైన్ విధానం తీసుకురావటం ఓ సంచలనం. బాల్కనీ సీటుకి రూ. 30 పెట్టడంతో పెద్ద నిర్మాతలు తలలు పట్టుకున్నారు.
ధరల పంచాయితీ
టికెట్ రేట్లు పెంచాలని ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి మాట్లాడారు. తర్వాత మహేశ్, ప్రభాస్ సహా నిర్మాతలను తీసుకెళ్లి చర్చించారు. జగన్ సానుకూలంగా స్పందించి టికెట్ రేట్లు పెంచడంతో విషయం కొలిక్కి వచ్చింది.
జగన్‌తో జగమంత కుటుంబం
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 నుంచి టికెట్ రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా పెద్దగా కలెక్షన్లు రాలేదు. దీంతో చిత్ర నిర్మాతలందరూ కలిసి కొండెక్కిన టికెట్ ధరలను రూ. 200 నుంచి రూ. 100కి తీసుకువచ్చారు.
టికెట్ రేట్లపై జ్ఞానోదయం
థియేటర్లలో సినిమాలు ఆడకపోవటానికి ఓటీటీ కూడా కారణం అని భావించారు నిర్మాతలు. నెలరోజుల్లోపే ఓటీటీలోకి వస్తుండటంతో కలెక్షన్లు రావటం లేదని వాటిపై షరతులు విధించారు. విడుదలైన 8 వారాల తర్వాతే ఇస్తున్నారు.
ఓటీటీ నిర్ణయాలు
జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 25 ఏళ్లు అయ్యింది. ఈ సంవత్సరం తారక్ ఆర్ఆర్‌ఆర్ సినిమాతో హిట్ అందుకున్నారు. భీం పాత్రకు ప్రశంసలు దక్కాయి.
NTR పాతికేళ్ల ప్రయాణం
జయం సినిమాతో పరిచయమైన నితిన్ అంచలంచెలుగా స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. ఇటీవల వరుస హిట్లతో దూసుకుపోతున్న నిజామాబాద్ కుర్రాడు వచ్చి 20 ఏళ్లు అయ్యింది. అంతేకాదు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గాను సేవలందిస్తున్నాడు.
నితిన్ వచ్చి 20 ఏళ్లు
మహేశ్ బాబు ఇంట్లో ఈ ఏడాది విషాదం నెలకొల్పింది. అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవీ సహా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయారు.
మహేశ్ ఇంట విషాదం
రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు లోటును మిగిల్చింది. పెద్దనాన్న మృతితో ప్రభాస్ కుమిలిపోయారు. పెద్దకర్మ రోజున ఊర్లో అందరికీ వివిధ రకాల వంటకాలతో భోజనాలు పెట్టారు.
ప్రభాస్‌ది అదే పరిస్థితి
హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఆమెకు మయోసైటిస్ సోకింది. దీనివల్ల కండరాలు త్వరగా అలసిపోయి పనిచేయలేరు. వ్యాధితో ఎలాంటి ప్రమాదం లేదు. మయోసైటిస్‌తోనే ఆమె యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పారు.
సమంత మయోసైటిస్
టాప్ హీరోయిన్ కాజల్ ఈ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బాలుడికి కిచ్లూ అని పేరు పెట్టారు. తల్లి అయిన తర్వాత కాజల్ సినిమాల్లో నటించడం లేదు.
కాజల్ కిచ్లూ
హీరో రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి చాలా రోజులైనా పిల్లలు కనకపోవటంపై అప్పట్లో చర్చ జరిగింది. దీనిపై ఉప్సి అది వ్యక్తిగతమని తేల్చేసింది. ఇటీవల చరణ్ తండ్రి కాబోతున్నాడని చిరు ప్రకటించటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
చరణ్, ఉప్సి గుడ్ న్యూస్
సినీ కార్మికులకు అండగా నిలబడే చిరంజీవి మరోసారి మంచి మనసు చాటారు. ఓ ఆస్పత్రితో మాట్లాడి వారికి ఉచిత వైద్య పరీక్షలు చేయించే అవకాశం కల్పించటమే కాకుండా హెల్త్ కార్డులు జారీ చేయించారు.
చిరు సాయం
సరైన వేతనం ఇవ్వాలంటూ సినీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. కొద్దిరోజులు షూటింగ్‌లకు వెళ్లలేదు. నిర్మాతలందరూ మళ్లీ హామీ ఇవ్వటంతో చిత్రీకరణలు ప్రారంభమయ్యాయి.
షూటింగ్‌లు బంద్
లైగర్ సినిమా ఫ్లాప్‌తో డబ్బులు చెల్లించాలని పూరీని డిస్టిబ్యూటర్లు ఆశ్రయించారు. ధర్నాకు దిగాలని చూశారు. దీనికి పూరీ కేసు పెట్టాడు. అంతేకాదు, నేను గట్టిగా మాట్లాడితే ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదనే డైలాగ్ ఫేమస్ అయ్యింది. పూరీకి పరిశ్రమ మద్దతు పలికింది.
పూరీకి వార్నింగ్
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.