సన్నపడినా… అందానికే అసూయ తెప్పిస్తున్న  తెలుగు హీరోయిన్లు

YouSay Short News App

హీరోయిన్లు బరువు తగ్గితే అందంగా కనిపించరు అనే ఓ అభిప్రాయం జనాల్లో ఉండి పోయింది. కానీ, సన్నపడినా చెక్కు చెదరని అందం మా సొంతం అంటున్నారు కొంతమంది కథనాయికలు.

కెరీర్‌ ఆరంభంలో బొద్దుగా కనిపించిన భామలు. తర్వాత జీరో సైజ్‌ ట్రై చేసి అందానికే అసూయ తెప్పిస్తున్నారు. ఆ టాలీవుడ్ నెరజానలు ఎవరో  ఓ లుక్కేయండి.

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఫేమ్ మెహ్రీన్ పీర్జాదా సూపర్‌ హిట్స్‌తో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కాస్త లావుగా కనిపించిన ఈ చిన్నది ఉన్నపలంగా సన్నగా మారిపోయింది.

మెహ్రీన్ పిర్జాదా

మంచిరోజులొచ్చాయి, ఎఫ్‌3 చిత్రంలో సన్నని నడుముతో వయ్యారాలు వొలకిస్తూ అదరగొట్టింది. బరువు తగ్గినా తన అందంలో ఏ మార్పు లేదని నిరూపించింది.

హరియాణా మాజీ సీఎం భజన్‌లాల్‌ మనువడితో ప్రేమలో పడిన మెహ్రీన్‌.. వివాహం కోసం సన్నబడిందని టాక్. కానీ, తర్వాత పెళ్లి ఆగిపోవటంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

‘మనం’లో కామియో రోల్ చేసి ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చింది రాశీఖన్నా. బొద్దుగా, ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్‌కు ఫ్యాన్‌ బేస్‌ ఒక్కసారిగా పెరిగింది.

రాశీ ఖన్నా

కొద్ది రోజుల నుంచి రాశీ జీరో సైజ్‌కి ట్రై చేస్తుంది. ప్రస్తుతం చాలా వరకు సన్నగా మారిపోయింది. అయినా అదే గ్లో, అందంతో రెచ్చిపోతుంది దిల్లీ భామ.

కెరీర్‌ ఆరంభంలో బాడీ షేమింగ్ కామెంట్స్‌ ఎదుర్కొన్నట్లు చెప్పింది రాశీ ఖన్నా. అందుకే చిక్కిపోయానంటూ చిరునవ్వు నవ్వేస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో అంజలి గుర్తుందా. అచ్చం సౌందర్యలా అందంగా ఉన్నావని అందరూ చెప్పుకొచ్చారు.

అంజలి

ఆ అందంతోనే అమ్మాయికి ఆఫర్లు వరుసగా వచ్చాయి.. బడా హీరోల సరసన చేసింది. ఇప్పుడు రూపురేఖలు మారిన శరీరానికే పరిమితం చేశానంటుంది అంజలి.

విజయ్‌ దేవరకొండ సరసన టాక్సీవాలా చిత్రంలో మెప్పించిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌. మెుదట్లో ఓ లఘు చిత్రం చేసిన అమ్మడు చాలా బొద్దుగా ఉండేది.

ప్రియాంక జవాల్కర్‌

శరీరంపై దృష్టి పెట్టి బరువు తగ్గిన సొగసరి తీగలాంటి నడుముతో కుర్రకారుకి కిర్రెక్కిస్తోంది. 

SR కళ్యాణమండపంలోని ‘చుక్కల చున్నీకే’ సాంగ్‌లో అమ్మడి నడుము వయ్యరాలు అప్పట్లో కుర్రకారును హీటెక్కించాయి.  సామాజిక మాధ్యమాలో ఈ సాంగ్ తెగ వైరల్ అయింది.

నయనతారది చెక్కు చెదరని అందం. గజినీ, లక్ష్మీ, చంద్రముఖి సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపించిన నయన్ తర్వాత జీరో సైజ్‌కి వచ్చేసింది.

నయనతార

దాదాపు సన్నబడినప్పటికీ ఆమెలో ఏ మార్పు రాలేదు. మరింత అందంగా మారింది నయనతార. వరుస ఆఫర్లను కొట్టేసింది.

ప్రస్తుతం చాలాకాలంగా హీరోయిన్ ఓరియెంటెడ్‌ మూవీలకు ప్రాధాన్యత ఇస్తుంది నయన్. బ్యాక్‌ టూ బ్యాక్ హిట్లతో దూసుకెళ్తోంది.