ఈ వారం (Nov 18) విడుదలవుతున్న  తెలుగు సినిమాలు, సిరీస్‌లు

YouSay Short News App

ప్రతివారం కొత్త కొత్త సినిమాల విడుదలతో మూవీ లవర్స్ సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, ఈ వారంలో పెద్ద సినిమాల విడుదలలు లేవు. దీంతో సందడి కరవైంది. చిన్న సినిమాలు థియేటర్ల వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి.

క్రైం సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న చిత్రం ప్లే. హైదరాబాద్‌లో జరిగిన ఓ హత్య చుట్టూ జరిగే నేర విచారణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ప్లే(PLAY)

ఈ సినిమా కూడా ఈ నెల 18న థియేటర్లలో విడుదలవుతోంది. వడాలి జయంత్, సంఘశ్రీ, చలాకి చంటి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా ఇది తెరకెక్కింది. డి.గణేశ్ దర్శకత్వం వహించగా, ప్రభు రెడ్డి నిర్మించారు.

బెస్ట్ కపుల్

నటి ‘సంగీత’ బిగ్ స్క్రీన్‌పై పునరాగమనం చేస్తున్న సినిమా ‘మసూద’. తన కుమార్తెను దుష్టశక్తుల నుంచి ఓ తల్లి ఎలా కాపాడుకుంటుందనేదే ఈ సినిమా కథ. తల్లిగా సంగీత నటించింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మసూద

లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ నెల 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

OTT విడుదలలు..

గాడ్ ఫాదర్..

కార్తి నటించిన సర్దార్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఈ నెల 18న ఆహాలో విడుదలవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ జరగనుంది.

సర్దార్..

ఈ మూవీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ నెల  17న ఓటీటీలో విడుదల కానుంది.

ఐరావతం..

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ ఇది. ఈ నెల 17 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ప్రసారం కానుంది.

ఆహా నా పెళ్లంట..