ఈ వారం (dec-16) థియేటర్‌ OTTలోకి వచ్చే తెలుగు సినిమాలు

YouSay Short News App

ఈ వారం సినిమా థియేటర్లు ఫుల్‌గా దర్శనమివ్వబోతున్నాయి. ఎందుకంటే ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా బాక్సాఫీస్‌  వద్ద సందడి చేయనుంది. దీంతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు క్యూ కట్టబోతున్నాయి.  అవేంటో చూసేద్దాం.

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న అవతార్ 2 : ది వే ఆఫ్ వాటర్ చిత్రం డిసెంబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్‌ ఓపెన్ అవ్వగా టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.

అవతార్ విజువల్ వండర్

మానవుల కారణంగా పాండోరాను కోల్పోయిన నావీ తెగ ఎక్కడికి వెళ్లింది. సముద్రంతో అనుబంధం ఎలా ఏర్పడింది అనే విషయాలను దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ చూపించనున్నాడు.  ఈ విజువల్ వండర్‌ ఎలా ఉంటుందో చూాడాలి.

రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్ కీలక పాత్రల్లో నటించిన ‘శాసనసభ’ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌ డిసెంబర్ 16న విడుదలకు సిద్ధమయ్యింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రంలో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్‌ జంటగా నటించారు.

శాసనసభ

క్రైమ్ 23, బ్రూస్‌ లీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అరుణ్ విజయ్‌ ‘ఆక్రోశం’ సినిమాతో మరోసారి పలకరించనున్నాడు. డిసెంబర్ 16న  ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలవుతోంది.

అరుణ్ విజయ్ ఆక్రోశం

తెలుగులో మెుదటిసారి లైవ్‌ కమ్ యానిమేషన్‌తో రూపుదిద్దుకున్న సినిమా పసివాడి ప్రాణం. అల్లు వంశీ, ఇతి ఆచార్య పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 16న థియేటర్లలోకి వస్తుంది.

పసివాడి ప్రాణం

విరాట్, శ్రీలీల , అపూర్వగౌడ కీలక పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘ఐ లవ్‌ యు ఇడియట్’ డిసెంబర్ 17న విడుదలవుతోంది. ఈ సినిమా 2019లోనే కిస్ పేరుతో కన్నడలో రిలీజ్ అయ్యింది.

ఐ లవ్‌ యూ ఇడియట్

ఇంటింటి రామాయణం - ఆహా - డిసెంబర్ 16

ఓటీటీలోకి వస్తున్న చిత్రాలు

జగమే మాయ - డిస్నీ హాట్‌ స్టార్‌ - డిసెంబర్ 15

గోవిందా నామ్‌ తేరా - డిస్నీ హాట్‌స్టార్ - డిసెంబర్ 16

నేషనల్ ట్రెజర్ ( వెబ్ సిరీస్ )- డిస్నీ హాట్‌స్టార్ - డిసెంబర్ 14

అరియిప్పు ( మలయాళం ) - నెట్‌ఫ్లిక్స్ - డిసెంబర్ 16

కోడ్‌నేమ్ తిరంగా ( హిందీ ) - నెట్‌ఫ్లిక్స్  - డిసెంబర్ 16

ఇండియన్ ప్రిడేటర్ ( హిందీ సిరీస్ ) - నెట్‌ఫ్లిక్స్ - డిసెంబర్ 16

ద రిక్రూట్ ( వెబ్ సిరీస్ ) -  నెట్‌ఫ్లిక్స్ - డిసెంబర్ 16

ఫిజిక్స్ వాలా ( వెబ్ సిరీస్ ) - అమెజాన్ ప్రైమ్ -  డిసెంబర్ 15

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.