మరోసారి సంక్రాంతికి బాలయ్య, చిరంజీవి పోటీ పడబోతున్నారు. అటు కోలీవుడ్‌లో విజయ్, అజిత్ తేల్చుకోబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దామా.
చైతన్య రావు, అలెగ్జాండర్ సల్నికోవ్, కటాలిన్ గౌడ, ప్రియ పాల్వాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎ జర్నీ టు కాశీ’. ముని క్రిష్ణ దర్శకత్వం వహించారు. జనవరి 6న విడుదలవుతోంది.
ఎ జర్నీ టు కాశీ - 6 January
మందపాటి కిరణ్ డైరెక్ట్ చేసిన క్రైం డ్రామా చిత్రమే ‘మైఖేల్ గ్యాంగ్’. సాయిచరణ్ తేజ, ఆదిత్య శివ ప్రధాన పాత్రలు పోషించారు.
మైఖేల్ గ్యాంగ్ - 6 January
ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘ప్రత్యర్థి’. శంకర్ ముదావత్ దర్శకత్వం వహించగా సంజయ్ సాహా నిర్మాతగా వ్యవహరించారు.
ప్రత్యర్థి - 6 January
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ‘విప్లవ సేనాని వీర గున్నమ్మ’. 1940లో శ్రీకాకుళంలో జరిగిన ఘటనలను స్ఫూర్తిగా తీసుకుని గుణ అప్పారావు తెరకెక్కించారు.
విప్లవ సేనాని వీర గున్నమ్మ - 6 January
ఒక్కడు సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు రీరిలీజ్ చేస్తున్నారు.
ఒక్కడు (Re-Release) - 7 January
బాలయ్య డ్యుయల్ రోల్ పోషించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతోంది.
వీరసింహారెడ్డి - 12 January
సంక్రాంతి బరిలో పోటీపడుతున్న తమిళ చిత్రం ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’గా విడుదలవుతోంది. జనవరి 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తునివు / తెగింపు (Tam & Dub) - 12 Jan
తమిళ నటుడు విజయ్ ‘వరిసు’ చిత్రం తెలుగులో ‘వారసుడు’గా వస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది.
వారిసు / వారసుడు (Tam & dub) - 12 Jan
ఈ సంక్రాంతికి అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ అతిథి పాత్రలో నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయిక.
వాల్తేరు వీరయ్య - 13 January
సంక్రాంతికి సై అంటున్న మరో సినిమా ‘కళ్యాణం కమనీయం’. సంతోష్ శోభన్ హీరో. ప్రభాస్ సొంత బ్యానర్ యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
కళ్యాణం కమనీయం - 14 January
మణికాంత్ జెల్లి దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా.. ‘విద్యావాసుల అహం’. .రాహుల్ విజయ్, శివాణీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
విద్యావాసుల అహం - 20 January
షారూక్ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలవుతోంది.
పఠాన్ (Hin & dub) - 25 January
సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రమే హంట్. తమిళ నటుడు భరత్ ఇందులో కీ రోల్ పోషించాడు. మహేశ్ దర్శకత్వం వహించాడు.
హంట్ - 26 January
జగదీప్ విష్ణు డైరెక్ట్ చేసిన చిత్రమిది. మ్యూజిక్ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ప్రవీణ్ కందేలా, జయేత్రి మేఖన ప్రధాన పాత్రల్లో నటించారు.
రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం - 26 January
అర్జున్ దాస్, అనిఖ సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో.. చంద్రశేఖర్ టి. రమేశ్ దర్శకత్వం వహించిన త్రిల్లర్ మూవీ ‘బుట్టబొమ్మ’. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలవుతోంది.