YouSay Short News App

అందుకే అమిగోస్ ఒప్పుకున్నా... అషికా రంగనాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ అమిగోస్‌ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది

అమిగోస్‌తోనే ఈ కన్నడ సోయగం తెలుగు తెరకు పరిచయం కాబోతుంది

అమిగోస్ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది

ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అమిగోస్‌లో తన పాత్ర గురించి పంచుకుందీ కన్నడ బ్యూటీ

సినిమాలో తక్కువ సమయం ఉన్నా మంచి నటనని ప్రదర్శించే అవకాశం లభించినట్లు తెలిపింది.

చిన్న‌ప్పట్నుంచి తెలుగు సినిమాలు చూడటం, పాటలు వినడం వల్ల  తెలుగు అర్థ‌మవుతుందని తెలిపింది.

తన జీవితంలోకి భర్తగా వచ్చే వ్యక్తి గురించి ప్రతి అమ్మాయి కలలు కంటూ ఉంటుంది. ఈ క్రమంలో తన అభిరుచికి తగ్గట్టుగా లేడంటూ ప్రతి అబ్బాయినీ తిరస్కరించే అమ్మాయిగా సినిమాలో కనిపిస్తానని పేర్కొంది.

అమిగోస్‌లో యాషికా అనే ఓ రేడియో జాకీగా కనిపిస్తానని చెప్పింది

ఒకే రకంగా ఉండే ముగ్గురు వ్యక్తుల కథ కావడం, అందులోనూ హీరోయిన్‌గా నా పాత్రకి తగిన ప్రాధాన్యం దక్కడం నచ్చే 'అమిగోస్‌' చేయడానికి ఒప్పుకున్నాని చెప్పింది.

హీరో స్థాయిలో సినిమాలో కనిపించకపోయినా, తానెప్పుడు వచ్చినా ఆ ప్రభావం సినిమాపై కనిపిస్తుంటుంది అని చెప్పుకొచ్చింది.

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి