7 బెస్ట్‌ ప్లేసెస్‌ ఇవే

2023 న్యూ ఇయర్‌కు ఫ్యామిలీతో వెళ్లగలిగే

YouSay Short News App

గుల్ మార్గ్, జమ్ము కశ్మీర్

కశ్మీర్‌లోని గుల్ మార్గ్ పండగ వాతావరణం కలిగి ప్రశాంతంగా ఉండే పట్టణం. కొత్త సంవత్సరం ఉత్సాహంగా జరుపుకునేందుకు అనువైన ప్రదేశం.

ఆహ్లాదకరమైన వాతావరణం, మంచుకొండలు పంచే అనుభూతితో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోక తప్పదు. పశ్చిమ హిమాలయాల ఆనుకుని ఉంటుంది. బయట ప్రాంతాల్లో వేడుకలు జరుపుకునే వారికి గుల్ మార్గ్  ఓ స్వర్గధామం.

ఉదయ్ పూర్, రాజస్థాన్

సరస్సుల నగరంగా ఉదయ్‌పూర్‌కు పేరు. ఎన్నో చారిత్రక, స్మారక కట్టడాలకు నిలయం. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవటానికి అద్భుతమైన ప్రాంతం.

తక్కువ ధరకే కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు లభిస్తాయి. రాజులకాలం రుచులు, పచ్చని పల్లెటూరు వాతావరణం వంటివి మనల్ని ఆహ్లాదంలో ముంచెత్తుతాయి.

మనాలీ, హిమాచల్ ప్రదేశ్

మంచు కురుస్తుండగా క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఆటపాటలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని అనుకుంటే మనాలీ వెళ్లాల్సిందే. మనాలీని దేవుళ్ల నగరంగా అభివర్ణిస్తారు.

ఎన్నో సాహసోపేతమైన క్రీడలు, అందమైన లొకేషన్లకు నిలయం. స్థానిక సంస్కృతి మనల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ ఉన్నాయంటే కొంత రద్దీ ఉండక తప్పదుగా మరి.

కసోల్, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లో పార్వతి నదిపై నిర్మించిన చిన్న గ్రామం కసోల్. ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలిచే  ఈ గ్రామాన్ని భారతదేశపు అమ్ స్టర్ డ్యామ్ అని పిలుస్తుంటారు.

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇదొక మంచి ప్రదేశం. ఇజ్రాయెల్ నుంచి చాలామంది కసోల్‌కు వలస రావటంతో అక్కడి సంస్కృతి ప్రతిబింబిస్తోంది.

ఊటీ, తమిళనాడు

ఊటీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రకృతి అందాలు, కొండ ప్రాంతాలు, టీ తోటలకు అత్యంత ప్రసిద్ధి.

దేవుడు ఇక్కడ నివసించి ఉంటాడేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వెళితే చుట్టు పక్కల కూడా చూడదగిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి.

కొడై కెనాల్, తమిళనాడు

హనీమూన్ స్పాట్ గా పేరున్న ప్రాంతం కొడైకెనాల్. ఆకర్షణీయమైన జలపాతాలు, పొగమంచు కప్పబడి ఉన్న కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం కొడైకెనాల్ ను అందంగా మార్చాయి.

చెరువు ఒడ్డున నిర్మించి ఉన్న అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతం. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఒత్తిడిని వదిలించుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ బైక్ పై కొడైకెనాల్ చుట్టూ  అటవీ ప్రాంతంలో చక్కర్లు కొడితే ఆ మజానే వేరు.

అలప్పుజా, కేరళ

కేరళలో సహజంగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో అలప్పుజా ఒకటి. ప్రస్తుతం అలెప్పీ అని పిలుస్తున్నారు. పడవలో ప్రయాణిస్తూ ఆనందంగా గడపవచ్చు. అందులోనూ కుటుంబ సభ్యులతో కలిసి వెళితే అది అద్భుత ప్రయాణమే.

నదుల్లో తెప్పపై వెళుతూ ఎన్నో దృశ్యాలను చూడవచ్చు. కొత్త సంవత్సరం వేళ అలెప్పీ పట్టణం సందర్శకులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇక సీ ఫుడ్ రుచులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కొత్త సంవత్సరాన్ని ఉల్లాసంగా గడపాలంటే అలప్పుజా పయనం అవ్వొచ్చు.