ఇండియాలో చాలా మందికి ‘YouTube’ ఒక ఆదాయ వనరుగా మారింది. ఎంతోమంది ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ఈ వేదికపై ఆధారపడి యూట్యూబర్లు లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఇటీవల యూట్యూబ్‌లో VTubers హవా నడుస్తోంది. కరోనా కాలంలో వీ ట్యూబర్స్ ప్రాచుర్యంలోకి వచ్చారు. వివిధ జానర్‌లలో వీరు చేసే వీడియోలు తెగ ట్రెండవుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంస్కృతి మరింత విస్తరించే అవకాశం ఉంది.
VTubers నే వర్చువల్ యూట్యూబర్స్ అని అంటుంటారు. సాధారణంగా యూట్యూబర్లు తెరపై కనిపిస్తారు. కానీ, వర్చువల్ యూట్యూబర్స్ ముఖాలని మనం చూడలేం. వారు స్క్రీన్‌పై కనిపించరు. కేవలం మాటలు ద్వారానే వీరు కమ్యూనికేట్ అవుతుంటారు.
VTubers అంటే ఎవరు?
కంటెంట్ ని విభిన్నంగా ప్రజెంట్ చేయాలనే ఆలోచనలో భాగంగా వచ్చిందే ఇది. అయితే మరో రకంగా కూడా ఇది ఉపయోగపడుతోంది. మనలో చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. వేదికలపై మాట్లాడాలంటే జంకుతాం. కానీ, మామూలు పరిస్థితుల్లో అనర్గలంగా వాదించగలం. ఇట్లాగే కెమెరా ఫియర్ ఉన్నవారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఎందుకిలా?
యూట్యూబర్లయితే నేరుగా కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతుంటారు. ఇక వర్చువల్ యూట్యూబర్స్ దీనికి విరుద్ధం. కొత్త పాత్రలను, అవతారాలను సృష్టిస్తారు. యానిమేషన్, కార్టూన్, మోజోల రూపంలో వ్యూయర్స్‌తో కమ్యూనికేట్ అవుతుంటారు. అంటే తెరపై పాత్రలు కదులుతుంటే డబ్బింగ్ వీరు చెప్తారన్నమాట. మరికొందరు కేవలం ఫేస్ వరకు మాత్రమే అవతార్‌ని క్రియేట్ చేస్తుంటారు.
ఎలా చేస్తారు?
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. చాలామంది ఉద్యోగం చేస్తూనే ఈ రంగంలో రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలా చేసే వర్చువల్ యూట్యూబర్ల సంఖ్య పెరుగుతోంది. కొంతమంది దీన్నే ప్రొఫెషన్‌గా మార్చుకుంటుంటే, మరికొంత మంది పార్ట్‌టైంగా పనిచేస్తున్నారు.
టాలెంట్..
వర్చువల్‌గా యూట్యూబ్ వీడియోలు చేయడం అంత సులభం కాదు. దీని వెనక ఎంతో కష్టం ఉంటుంది. టెక్నాలజీపై మంచి పట్టు ఉంటేనే వీటిని చేయగలం. వీటికోసం కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.
ఈజీ కాదు..
జపాన్‌లోనే వీట్యూబర్లు ఆవిర్భవించారు. ఆ దేశానికి చెందిన ‘కైజునా ఏఐ’ ఈ ట్రెండ్‌ని మొదలు పెట్టింది. వర్చువల్ యూట్యూబర్ అన్న పదాన్ని తొలుత వినియోగించింది 2016లోనే. 2020ల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.
జపాన్‌లో షురూ
తెలుగులో కూడా వీట్యూబర్ల ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా ట్రోలింగ్ కోసమని ఈ వేదికను ఎంచుకుంటున్నారు. మరికొందరేమో తమ కంటెంట్‌ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు.
తెలుగులో..
‘ఫిల్మిమోజి’, ఫన్‌మోజి, పోటుగాడు, సూపర్ మోజీ, ఫిల్మి ఫన్ అనిమోజీ, ఈమోజీ మామ వంటి వీట్యూబర్లు రాణిస్తున్నారు. మరికొన్ని ట్రోలింగ్ ఛానళ్లు కూడా ఆదరణ పొందుతున్నాయి.
ఇవి..
మీలోనూ ఈ టాలెంట్ ఉంటే ఎంచక్కా దీన్నొక కెరీర్‌గా ఎంచుకోవచ్చు. కావల్సిందల్లా కొన్ని యానిమేషన్ సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకోవడమే. వీడియో ఎడిటింగ్‌పై మంచి నైపుణ్యం కలిగి ఉండాలి. మీరూ స్టార్లుగా ఎదగొచ్చు.
భవిష్యత్..
మరిన్ని ఆసక్తికర కథనాల కోసం వెబ్‌సైట్‌ని చూడండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.