అతిపెద్ద గిరిజన జాతర వచ్చేసింది. జనవరి 21న నాగోబా జాతర ప్రారంభం

YouSay Short News App

తెలంగాణ రాష్ట్ర పండుగ నాగోబా జాతర మళ్లీ వచ్చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్ ఈ జాతరకు ముస్తాబైంది. ఈ నెల 21నుంచే జాతర ప్రారంభం కానుంది.

నాగోబా జాతరకు ఎంతో విశిష్ఠత ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఇదొకటి.  నాగదేవుడిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. గిరిజన వాసులైన మెస్రం వంశస్థులు ఈ జాతరను వైభవంగా నిర్వహిస్తారు.

అతిపెద్ద గిరిజన జాతర

పుష్యమి మాసం నెలవంక కనిపించాకే ఈ జాతరను ప్రారంభిస్తారు. దాదాపు వారం రోజుల పాటు  ఈ జాతర ఉంటుంది. జనవరి 21 రాత్రి నుంచి జనవరి 28వరకు నాగోబా జాతర జరగనుంది.

వారం రోజుల పాటు

ఈ జాతరకు ప్రత్యేకించి సిరికొండ కుండలను మాత్రమే వాడుతారు. వీటిలోనే గోదావరి నీటిని అభిషేకానికి తీసుకొస్తారు. అందులోనూ గుగ్గిల వంశీయులు మాత్రమే ఈ కుండలను తయారు చేస్తారు.

సిరికొండ కుండలు

సిరికొండ కుండలను 20మంది గిరిజనులు నెత్తిన ఎత్తుకొని గోదావరి జలానికి బయలుదేరుతారు. 80కిలోమీటర్ల దూరం కాలినడక చేసి గోదావరి జలాన్ని అందులో తీసుకొస్తారు.

గోదావరి నీటితో అభిషేకం

గోదావరి నుంచి నదీ జలాన్ని తీసుకొచ్చి విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్ని శుద్ధి చేస్తారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో పూజను ప్రారంభిస్తారు. రాగి చెంబులో పాలు పోస్తే నాగదేవుడి తాగుతాడని గిరిజనులు విశ్విసిస్తారు.

పూజా విధానం

మెస్రం వంశంలోకి కొత్త కోడళ్లు వస్తే వారు తప్పక నాగోబాను సందర్శించుకోవాలి. నాగదేవుడికి పూజ చేస్తేనే వారు మెస్రం వంశీయులు అవుతారు. ఈ ప్రక్రియను ‘భేటింగ్ కీయ్‌వాల్’ అని పిలుస్తుంటారు. ఇలా పూజ చేసే సమయంలో వధువులు పూర్తిగా తెల్లటి వస్త్రాల్ని ధరిస్తారు.

కొత్త కోడళ్లకు తప్పనిసరి

మెస్రం వంశంలోకి కొత్త అల్లుళ్లకు కూడా ఓ ప్రక్రియ ఉంటుంది. అల్లుళ్లు మట్టిని కాళ్లతో మెత్తగా చేస్తే.. కూతుళ్లు ఆ మట్టితో అలుకుతారు. ఇలా చేసినందుకు అల్లుళ్లకు నజరానాలు ఇస్తారు.

అల్లుళ్లకు నజరానా

జాతరకు ఎంతమంది వచ్చినా వంటకాలు మాత్రం కేవలం 22 పొయ్యిల మీదే చేస్తారు.అది కూడా ఆలయ ప్రాంగణంలోని ప్రహరీ లోపలే  ఈ పొయ్యిలను ఏర్పాటు చేస్తారు.

22 పొయ్యిలే

వేడుకల అనంతరం ప్రజా దర్భార్ నిర్వహిస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. గిరిజనుల సమస్యలు తెలుసుకోవడమే ప్రజాదర్భార్ ముఖ్య ఉద్దేశం.

ప్రజా దర్భార్

నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రానున్నారు. ఈ నెల 22న ఆయన కేస్లాపూర్‌కు వస్తారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వెల్లడించారు.

కేంద్ర మంత్రి రాక