ఢిల్లీలో  కలకలం రేపిన ప్రియురాలి హత్య కేసు!

YouSay Short News App

BUMBLE DATING APP ద్వారా కలిసి…

ఇంత క్రూరమా

దిల్లీలో సహజీవనం చేస్తున్న యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో సమగ్రంగా చూద్దాం.

(Representational Image)

నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌,  హతురాలు శ్రద్ధా వాకర్‌ ‘బంబుల్’ డేటింగ్ యాప్‌లో పరిచయం అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2018 నుంచి వీరు రిలేషన్‌లో ఉన్నారు.

పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఉద్యోగం పేరిట దిల్లీకి వెళ్లిన ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.

గత మే నుంచి శ్రద్ధ ఫోన్‌కు స్పందించకపోవడంతో వారు ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వారు అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా తాళం ఉంది. వెంటనే వారు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ ప్రారంభించిన పోలీసులకు…పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో తానే శ్రద్ధను చంపేసినట్లు అఫ్తాబ్‌ ఒప్పుకున్నాడు. అంతేగాక విస్తుపోయే విషయాలు వెల్లడించాడు.

మే 18న శ్రద్ధ గొంతు కోసి చంపిన అఫ్తాబ్..ఆమె శరీరాన్ని 35 భాగాలుగా చేసి ఆ తర్వాత 18 రోజుల పాటు దిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు భాగాలు పారేశాడు.

(Representational Image)

శ్రద్ధను గొంతు కోసి చంపిన అఫ్తాబ్‌..హ్యూమన్‌ అనాటమీ వీడియోలు చూసి ఆమెను ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత 300లీటర్ల ఫ్రిజ్‌ కొని అందులో దాచి, రోజుకో చోట ముక్కలు పారేేశాడు. వాసన రాకుండా అగర్‌బత్తీలు వెలిగించేవాడు.

(Representational Image)

‘డెక్స్‌టర్‌’ అనే సీరియల్‌ కిల్లర్‌ వెబ్‌ సిరీస్‌తో పాటు మరికొన్ని క్రైమ్‌ థ్రిల్లర్స్‌ చూసి రక్తపు మరకలు కడిగేయడం, శరీర భాగాలను భద్రపరచడం వంటివి చేశాడు. గూగుల్‌లోనూ దీనికి సంబంధించి సెర్చ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

శ్రద్ధ శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉండగానే అఫ్తాబ్‌ మరో యువతిని అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాడు. శ్రద్ధ పరిచయమైన ఆన్‌లైన్‌ డేటింగ్ యాప్‌లోనే, ఆ యువతికి కూడా వల వేశాడు. ఈ విషయాన్ని విచారణలో అఫ్తాబ్‌ స్వయంగా ఒప్పుకున్నాడు.

అయితే శ్రద్ధ హత్య వెనుక ఆ మహిళ హస్తం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమేరకు డేటింగ్ యాప్‌ Bumble App నుంచి అఫ్తాబ్ ప్రొఫైల్ విజిటర్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు.

శ్రద్ధ బతికే ఉందని నమ్మించేందుకు అప్పుడప్పుడూ ఆమె సోషల్‌ మీడియా ఆకౌంట్లలో పోస్టులు పెట్టేవాడు,ఆమె స్నేహితులకు సందేశాలు పంపేవాడు. కానీ కాల్స్‌ మాట్లాడకపోవడంతో ఆమె స్నేహితులకు అనుమానం వచ్చింది.

అఫ్తాబ్‌, శ్రద్ధ ముంబయిలో ఉన్నపుడు తొలుత బాగానే ఉండేవారని, కానీ తర్వాత అఫ్తాబ్‌ తనను కొొడుతున్నట్లు శ్రద్ధ తమతో చెప్పేదని ఆమె స్నేహితులు చెప్పారు. దిల్లీ వెళ్లాక తనతో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయన్నారు.

గతంలో ఓసారి అఫ్తాబ్‌ నన్ను చంపేస్తాడంటూ తన స్నేహితుడొకరికి మెసేజ్‌ పెట్టింది. అప్పుడతను తన ఫ్రెండ్స్‌తో వెళ్లి ఆమెను రక్షించాడు. ఆ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ నాడార్ అనే వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించాడు.

(Representational Image)

అఫ్తాబ్‌ నుంచి శ్రద్ధ విడిపోవాలనకుందని కానీ అతడిపై ఉన్న ప్రేమ కారణంగా అలాగే ఉండిపోయిందని స్నేహితులు చెప్పారు. ఎంత వేధించినా ఆమె అతడితోనే ఉండాలనుకోవడమే ఆమెకు శాపంగా మారింది.

అఫ్తాబ్‌కు మరణ శిక్ష విధించాల్సిందేనని శ్రద్ధ తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కేసులో దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని దిల్లీ మహిళా కమిషన్‌ సైతం పోలీసులను ఆదేశించింది.