The Elephant Wisperers:  ఆస్కార్ గెలిచేంత ఏముంది  ఈ సినిమాలో?

YouSay Short News App

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

95వ ఆస్కార్ మహోత్సవంలో ఇతర భాషల లఘుచిత్రాలతో పోటీ పడి భారతీయ సినిమా అవార్డు గెలుచుకోవడం గొప్ప విశేషం.

ఆస్కార్ వేదికపై డైరెక్టర్ ‘కార్తికి గొన్సాల్వేస్’ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును జన్మభూమి భారత్‌కు అంకితం ఇచ్చారు.

హాలౌట్, హౌ డు యు మెజర్ ఎ ఇయర్, ద మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ద గేట్ చిత్రాలతో పోటీ పడి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుపొందిన తొలి భారతీయ చిత్రం ఇదే.

ఏనుగు, ఓ కుటుంబం మధ్య ఏర్పడే అనుబంధం గురించి వివరించేదే ఈ ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’

బొమ్మన్, బెల్లి దంపతులు ‘రఘు’ అనే అనాథ ఏనుగును చిన్నప్పుడే దత్తత తీసుకుని అపురూపంగా పెంచుకుంటారు. గాయపడిన ‘రఘు’కు ఎన్నో సపర్యలు చేసి పెంచుకునే క్రమంలో బంధుత్వం ఏర్పడుతుంది.

తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో కొలువై ఉన్న ‘ముదుమలై నేషనల్ పార్క్’లో ఈ సినిమాను చిత్రీకరించారు.

డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్‌కి ఇది తొలిచిత్రం కావడం విశేషం. మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

గిరిజనుల జీవన విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే పచ్చని అడవి అందాలను ఈ లఘుచిత్రం ద్వారా చూపించారు డైరెక్టర్ కార్తికి.

‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ తీయడానికి దాదాపు ఐదేళ్లు పట్టిందని డైరెక్టర్ కార్తికి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మూడు నెలలు వయసు ఉన్నప్పుడే పిల్ల ఏనుగు ‘రఘు’ను కలిసినట్లు కార్తికి గతంలో చెప్పారు. ఏడాదిన్నర పాటు ఈ ఏనుగుతో గడిపారట.

తమిళ భాషలో తెరకెక్కిన ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా స్టోరీని కార్తికి తల్లి ప్రిసిల్లా గొన్సాల్వేస్ అందించారు.

సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ కింద  ఈ సినిమా తెరకెక్కింది. గునీత్ మొంగా ప్రొడ్యూస్ చేశారు.

1969లో ద హౌజ్ దట్ ఆనంద బిల్ట్, 1979లో యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్ భారత్ నుంచి నామినేట్ అయినా ఆస్కార్‌ను పొందలేకపోయాయి. ద ఎలిఫెంట్ విస్పరర్స్  ఈ లోటును తీర్చింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.