2022లో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన అంశాలివే..!

YouSay Short News App

2022లో నెటిజన్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. మరి మన భారతీయులు అత్యధికంగా దేని గురించి వెతికారో తెలుసుకుందామా.

ఆర్మీ నియామకాల్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన పథకం ‘అగ్నీపథ్’. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పథకం కింద సైనికులుగా చేరిన వారికి భవిష్యత్తు ఉండబోదని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.

అగ్నీపథ్ స్కీం అంటే ఏమిటి?

అత్యధిక శోధనలు ఏమిటి?

నాటో అంటే ఏమిటి? NFT అంటే ఏంటి?  PFI అంటే? 4 వర్గమూలం ఏమిటి? అని  గూగుల్ తల్లిని అడిగారు.

ప్రయాణాలకు కోవిడ్ టీకా ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడంతో ఈ సర్టిఫికెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని గూగుల్‌ని ఆశ్రయించారు.

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?

ఎలా..?

ఇదే కాకుండా పీటీఆర్ కార్డ్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి, పార్న్‌స్టర్ మార్టినిని ఎలా తాగాలి?  ఈ-శ్రమ్ కార్డును ఎలా సిద్ధం చేయాలి? అంటూ శోధించారు.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా గురించి నెటిజన్ల అత్యధికంగా శోధించారు.

బ్రహ్మాస్త్ర

సినిమాలు

ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించి.. సుమారు రూ.450కోట్ల వసూళ్లను రాబట్టింది.

బ్రహ్మాస్త్ర తరువాత కేజీఎఫ్: చాప్టర్ 2, ద కశ్మీర్ ఫైల్స్, కాంతార సినిమాలు తరువాత స్థానాల్లో నిలిచాయి.

ఈ విభాగంలో సమీపంలో ఉన్న కోవిడ్ వ్యాక్సినేషన్‌కి సెంటర్ గురించి నెటిజన్లు ఎక్కువగా శోధించారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ నియర్ మి

నియర్ మి(Near me)

ఇందులో స్విమ్మింగ్ పూల్, వాటర్ పార్క్, మూవీస్, టేకవుట్ రెస్టారెంట్స్ ఓపెన్ నౌ నియర్ మి వంటి వాటిని వెతికారు.

క్రీడల్లో IPLకి సంబంధించిన విషయాలపైనే అత్యధికంగా శోధించారు. ప్రపంచవ్యాప్తంగా శోధనల్లో IPL 10వ స్థానంలో నిలిచిందంటే దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొవిన్, ఫిఫా వరల్డ్ కప్, ఆసియా కప్, ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.

IPL

క్రీడలు

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బీజేపీ అధికార ప్రతినిధి ‘నుపుర్ శర్మ’.  బీజేపీ అధిష్ఠానం నుపుర్‌ని సస్పెండ్ చేసింది. దేశవ్యాప్త ఆందోళనలూ వ్యక్తమయ్యాయి.

నుపుర్ శర్మ

వ్యక్తులు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, నటి సుష్మితా సేన్, లలిత్ మోడీల గురించి కూడా గూగుల్‌లో వెతికారు.

లతా మంగేష్కర్ మరణం దేశాన్ని కుదిపేసింది.  ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆమె తుదిశ్వాస విడిచారు. వార్తలకు సంబంధించి.. లతా మంగేష్కర్ మరణం గురించే అత్యధికంగా శోధించారు.

లతా మంగేష్కర్ మరణం

వార్తల్లో..

పంజాబీ సింగర్ ‘సిద్దు మూసేవాలా’, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, యూపీ ఎన్నికల ఫలితాలు, కోవిడ్-19 కేసుల గురించి కూడా నెటిజన్లు ఎక్కువగా వెతికారు.

పనీర్ పసందా రెసిపీ గురించి ఈ ఏడాది ఎక్కువ మంది వెతికారు. మణిపూర్, బిహార్, అస్సాం రాష్ట్రాల్లో ఇది చాలా ఫేమస్.

పనీర్ పసందా

రెసిపీ

మోదక్, సెక్స్ ఆన్ ద బీచ్, చికెన్ సూప్, మలాయ్ కోఫ్తా రెసిపీల గురించి కూడా నెటిజన్లు శోధించారు.