2022లో గూగుల్‌లో సెర్చ్ చేసిన  టాప్ 10 సినిమాలివే..!

You Say Short News App

నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్‌ని ఆశ్రయిస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది.

టాలీవుడ్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. కాంతార, కేజీఎఫ్2, విక్రమ్ సినిమాలు కూడా లిస్టులో ఉండటం విశేషం.

రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ జంటగా నటించిన చిత్రమిది. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా ఈ మూవీ గురించి నెటిజన్లు శోధించారు.

1. బ్రహ్మాస్త్ర

థియేటర్లు బోసిపోతున్న వేళ విడుదలైన  ఈ సినిమా బాలీవుడ్‌  ఇండస్ట్రీకి ఊపిరిలూదింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

మొదటి సినిమా విజయంతో అంచనాలు పెరిగిపోవడంతో ‘కేజీఎఫ్2’ పై ప్రేక్షకులకు సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. .

2. కేజీఎఫ్ 2

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ల కోసం ఫ్యాన్స్ తహతహలాడారు. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో కేజీఎఫ్2 ఒకటిగా నిలిచింది

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. కశ్మీరీ పండిట్ల అస్థిత్వం గురించి ఇందులో చూపించడంతో సినిమా చక్కర్లు కొట్టింది.

3. ద కశ్మీర్ ఫైల్స్

బీజేపీ నేతలు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం గమనార్హం.

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి మేకింగ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటన, కీరవాణి సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.

4. ఆర్ఆర్ఆర్

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆస్కార్ అవార్డు కోసమూ పోటీ పడుతోంది.

రిషభ్ శెట్టి డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన చిత్రం ఇది. అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించింది. రిషభ్ శెట్టి ఈ సినిమాకు వెన్నెముక. నటుడిగా విశ్వరూపాన్ని చూపించి..

5.కాంతార

దర్శకుడిగా విలక్షణతను చాటుకున్నాడు. సెప్టెంబరు 30న విడుదలైన ఈ సినిమా అనతి కాలంలోనే అశేష ఆదరణను పొంది.. కేజీఎఫ్2 రికార్డులను తిరగరాసింది.

లోకేష్ కనగరాజ్ సినీ వర్స్‌లో భాగంగా తెరకెక్కిన మూడో చిత్రమే విక్రమ్. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించాడు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య ఈ సినిమాలో కీ రోల్ పోషించారు. మ్యూజికల్‌ గానూ ఈ సినిమా మ్యాజిక్ చేసింది.

6. విక్రమ్

దర్శకుడు సుకుమార్ రూపొందించిన మరో మేటి సినిమా ఇది. ‘తగ్గేదె లే’ డైలాగ్, శ్రీవల్లి పాటకి బన్నీ స్టెప్పులు, ఊ అంటావా మామ పాట నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి.

7. పుష్ప

క్రికెటర్లు కూడా ఈ పాటకు కాలు కదిపారంటే  అర్థం చేసుకోవచ్చు. సినిమాలోని కొన్ని  సీన్లు నిజ జీవితాన్నీ ప్రభావితం చేశాయనడంలో అతిశయోక్తి లేదు.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఎంతో ఇష్టంగా చేసిన సినిమా ఇది. ఇందులో విభిన్న పాత్రల్లో కనిపించి ఆమిర్ ఆకట్టుకున్నాడు.

8. లాల్ సింగ్ చడ్డా

ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు కానీ, బాయ్‌కాట్ వివాదంలో చిక్కుకుని నెట్టింట చర్చకు కేంద్ర బిందువైంది.

అజయ్ దేవగణ్, టబు, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం 2’. ఈ చిత్రం నవంబరు 18న విడుదలైంది. సుమారు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు అంచనా.

9. దృశ్యం 2

వెంకటేశ్, మోహన్‌లాల్‌ల దృశ్యం 2 కన్నా ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ లభించడంతో సినిమా గురించి ఎక్కువగా వెతికారు.

టాప్ 10లో స్థానం దక్కించుకున్న ఒకే ఒక హాలీవుడ్ సినిమా ఇది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కానీ, బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టగలిగింది.

10. థార్: ద లవ్ అండ్ థండర్

ఈ సినిమా హిట్టా, ఫ్లాపా అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా గూగుల్‌ని ఆశ్రయించారు.