ఒక్క మ్యాచ్ టెస్టు క్రికెట్ గమనాన్ని మార్చేయగలదు. కనీవినీ ఎరుగని విధంగా జరిగే ఆ మ్యాచ్ ప్రేక్షకులను టెస్టు క్రికెట్ వైపు దృష్టి మళ్లించగలదు. ‘ఆట అంటే ఇది కదా’ అని మురిసిపోయేలా చేయగలదు. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి మ్యాచ్‌లు చాలా అరుదు. అవేంటో చూద్దాం.
ఓవైపు టీ20లకు ఆదరణ పెరుగుతోంది. మరోవైపు, క్రికెట్‌కు ఆయువు పట్టులాంటి టెస్ట్ ఫార్మాట్‌పై ఆసక్తి కొరవడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల చూపును తనవైపు తిప్పుకుంది. చరిత్రలో గుర్తుండిపోయేలా మ్యాచ్ ముగిసింది.
NZ vs ENG, 2023
సొంతగడ్డపై న్యూజిలాండ్ గొప్ప విజయాన్ని సాధించింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఫాలో ఆన్ నుంచి కోలుకుని టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా అరుదు. ఇలా ఫాలో ఆన్‌లో భారత్ తర్వాత ప్రత్యర్థిని ఓడించిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
ఒక్క పరుగు తేడాతో..
స్కోర్లు: NZ 209/10, (F/O)483/10ENG 435/8, 256/10
టెస్టు క్రికెట్ అనగానే గుర్తొచ్చే మ్యాచ్ ఇది. ఆస్ట్రేలియాపై కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించి భారత్ చరిత్ర సృష్టించింది. వీవీఎస్ లక్ష్మణ్(59, 281), రాహుల్ ద్రవిడ్(25, 180) హీరోలుగా నిలిచారు.
IND vs AUS, 2001
కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ని 171 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఫాలో ఆన్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా గొప్పగా పుంజుకుంది. ఏకంగా 657 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఆసీస్‌ని 212 పరుగులకే ఆలౌట్ చేసి 171 పరగుల తేడాతో విజయం సాధించింది.
తొలి ఫాలో ఆన్ విజయం..
స్కోర్లు: AUS 445/10, 212/10IND 171/10, (F/O) 657/7(dec)
గబ్బా టెస్టుగా ఈ మ్యాచ్ ప్రసిద్ధి చెందింది. 32 ఏళ్లుగా ఈ వేదికలో తిరుగులేని ఆస్ట్రేలియాకు తొలిసారి ఓటమి రుచి చూపించిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ విజయంతో సిరీస్‌ని 2-1తేడాతో భారత్ గెలుచుకుంది.
AUS vs IND, 2021
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులు చేసి భారత్‌కు 328 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్(89*) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 3 వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది.
పంత్ ఇన్నింగ్స్‌తో..
స్కోర్లు: AUS 369/10, 294/10;IND 336/10, 329/7
బర్మింగ్‌హాంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ క్రికెట్ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
AUS vs ENG, 2005
అప్పటి కీలక బౌలర్ మెక్‌గ్రాత్ మ్యాచ్‌కి ముందు దూరమయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ రెచ్చిపోయింది. 407 పరుగులు చేసింది. ఆసీస్‌ని 308 పరుగులకే కట్టడి చేసింది. 99 పరుగుల లీడ్‌ని ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా మలచలేకపోయింది. 182కే కుప్పకూలింది. 281 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 279 పరుగులకే చేతులెత్తేసింది.
దోబూచులాడిన లీడ్..
స్కోర్లు: ENG 407/10, 182/10AUS 308/10, 279/10.
టెస్టు క్రికెట్ చరిత్రలో ‘టై’గా ముగిసిన తొలి మ్యాచ్ ఇది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగింది.
AUS vs WI, 1960
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 453 పరుగులు చేసింది. బదులుగా ఆస్ట్రేలియా 505 పరుగులు చేసి 52 పరుగుల లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 282 పరుగులకు ఆలౌట్ అయింది. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 232 పరుగులు చేసి తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఫలితంగా మ్యాచ్ ‘టై’గా ముగిసింది.