2022లో ఇంతవరకు తెలుగులో బాక్సాఫీస్‌ హిట్లు ఇవే

‘బింబిసార’తో నందమూరి కల్యాణ్ రామ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాను రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లు వసూళ్లు సాధించింది.

బింబిసార

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అన్ని భాషల్లో కలిపి రూ.98 కోట్లు వసూళ్లు చేసింది.

సీతారామం

నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కార్తికేయ-2’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 110 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

కార్తికేయ-2

కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటించిన ‘కాంతారా’ మూవీ వసూళ్ల వేట కొనసాగించింది. కేవలం రూ. 2 కోట్ల తెలుగు హక్కులతో ఏకంగా రూ.32 కోట్ల కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది.

కాంతారా

శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మాతలు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.24 కోట్లు రాబట్టి, బడ్జెట్‌కు రెట్టింపు వసూళ్లు సాధించింది.

ఒకే ఒక జీవితం

ఈ ఏడాది విడుదలైన అన్ని చిత్రాల్లోకెల్లా ‘డీజే టిల్లు’ అతి పెద్ద హిట్ మూవీగా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాను రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. వరల్డ్‌వైడ్‌గా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

డీజే టిల్లు

తమిళ్ యాక్టర్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘డాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.2 కోట్ల తెలుగు హక్కులతో రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

డాన్

కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ‘777చార్లీ’ మూవీ తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు రూ.2.5 కోట్లు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు చేసింది.

777చార్లీ

కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కిన ‘విక్రాంత్ రోణ’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించింది. రూ.2 కోట్ల తెలుగు హక్కులతో ఈ చిత్రం రూ.10 కోట్లకుపైనే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

విక్రాంత్ రోణ

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తెలుగులో మెరుగైన కలెక్షన్లు రాబట్టింది. రూ.6 కోట్లకు తెలుగు హక్కులు అమ్ముడవగా, రూ. 29 కోట్లు వసూలు చేసింది.

బ్రహ్మాస్త్ర

అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ సినిమా అన్ని భాషల్లో బిగ్ హిట్‌గా నిలిచింది. రూ.32 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.64 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

మేజర్

కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. రూ.7 కోట్ల తెలుగు హక్కులతో రూ.33 కోట్ల కలెక్షన్లు కురిపించింది.

విక్రమ్

కార్తీ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. రూ.5.5 కోట్ల తెలుగు హక్కులతో రూ.10.5 కోట్లు వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

సర్దార్