2022లో ఒక్కరోజులో సెలెబ్రిటీస్ అయిపోయింది వీరే

YouSay Short News App

సామాజిక మాధ్యమాల్లో ఎవరు ఎందుకు ఎప్పుడు ఫేమస్‌ అవుతున్నారో తెలీదు. ఒక్కరోజులో చెప్పలేని పాపులారిటీ సంపాదిస్తున్నారు. గల్లీలో పల్లీలు అమ్ముకునే వ్యక్తి నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాకీ వరకు చాలామందే వార్తల్లో నిలిచారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘బంగారం ఒకటి చెప్పనా’ నుంచి బ్రో అదిరిపోయింది సినిమా అనే వ్యక్తులు ఉన్నారు. గుర్తొచ్చే ఉంటారు ఎందుకంటే అంతలా జనాల్లోకి వెళ్లారు మరి. జిన్నా ఆడియో లాంఛ్‌లో ఇద్దరు మహిళలు పాడిన పాటలు ఇప్పటికీ మీమ్స్‌లో ఊహేస్తున్నాయి. అలాంటి వారు కొందరి గురించి తెలుసుకోండి.

మధ్యప్రదేశ్‌కు చెందిన భుబన్ భద్యాకర్ రోడ్డుపై పల్లీలు అమ్ముకునేవాడు. వాటిని అందరూ కొనేందుకు తను అమ్మే పదాన్ని చిన్న ట్యూన్‌లా మార్చాడు. కచ్చా బాధం అంటూ పాడిన ఆ ట్యూన్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

కచ్చా బాదం కహానీ

భుబన్ దేశవ్యాప్తంగా కొద్దిరోజుల్లోనే పాపులారిటీ సంపాదించాడు. ఫేమస్ అవ్వటమే కాదు అతడిని లక్షాధికారిని కూడా చేసింది. ఆ పాటను చాలామంది ఆల్బమ్స్‌గా తీర్చిదిద్ది జనాల్లోకి వదిలారు. కొన్ని నెలలపాటు ఆ పాటలు మార్మోగాయంటే నమ్మండి.

కచ్చా బాదమ్ పాటతో ఎంతో మంది రీల్స్ చేశారు. అందులో ఓ అమ్మాయి మాత్రం తెగ గుర్తింపు తెచ్చుకుంది అంజలీ అరోరా. ఈ పాటకు అంజలీ వేసిన స్టెప్పులు సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలా అంజలీ దశ తిరిగింది. అప్పట్నుంచి ఆమెకు ఫాలోవర్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నారు.

అంజలీ అరోరా

క్రిెకెట్ మీమ్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న నెటిజన్లకు ఓ కొత్త ఎక్స్‌ప్రెషన్ దొరికింది. న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో గుట్కా నములుతూ ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తిపై నెటిజన్ల కన్నుపడింది. మీమ్స్‌తో మనోడు చాలా ఫేమస్ అయ్యాడు. అతడిని శోభిత్ పాండేగా గుర్తించారు.

గుట్కా గయ్

బాలీవుడ్ బాద్షా కింగ్‌ ఖాన్ షారుక్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను జైల్లో ఊసలు లెక్క పెట్టేలా చేసిన వ్యక్తి సమీర్ వాంఖడే. క్రూయిజ్ డ్రగ్స్‌ కేసులో ఎవ్వరు ఏం చెప్పినా వినకుండా పెద్దవాళ్లు ఉన్నారని లెక్క చేయకుండా కేసులు పెడుతూ వెళ్లిపోయారు.

సమీర్ వాంఖడే

రాజకీయ నేత నవాబ్ మాలిక్ విమర్శలు చేస్తే అతడిని కూడా అందులోకి లాగారు. ఎంత దూకుడుగా వెళ్లారో అదేస్థాయిలో విమర్శలు, బదిలీలు ఎదుర్కొని సమీర్ వార్తల్లో నిలిచారు.

ఫేమస్ అవ్వాలనుకున్నాడో  తెలీదు. మనోళ్లు చేశారో తెలీదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం రివ్యూ చెప్పి జనాల్లోకి వెళ్లాడు. బ్రో బ్రో అదిరిపోయింది డీజే టిల్లు. థియేటర్లన్నీ హౌస్‌ ఫుల్లు అంటూ రైమింగ్ టైమింగ్‌తో నెటిజన్లకు దొరకేశాడు లక్ష్మన్.

బ్రో అదిరిపోయిందిగా

అతడితో ఇప్పుడు ఏకంగా సినిమా ప్రమోషన్స్ చేయించుకుంటున్నారంటే ఎంతలా జీవితం మారిపోయిందో అర్థం చేసుకోండి.

ఈ పదం వినగానే ఎవరో గుర్తుపట్టే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శాంతి. బంగారం ఒకటి చెప్పనా ..చీ పోరా అంటూ చేసిన ఇన్‌ స్టా రీల్ కొన్ని కోట్ల మందికి చేరింది.

బంగారం ఒకటి చెప్పనా

దాని మీద ఎన్నో రీల్స్, మీమ్స్‌ వచ్చాయి. కొద్దిరోజుల్లోనే శాంతి చాలా పాపులారిటీ సంపాదించింది. ఆమెతో చాలామంది ఇంటర్వ్యూలు కూడా చేశారు.

జిన్నా ఆడియో ఫంక్షన్‌లో పాటలు పాడిన ఇద్దరు మహిళలకు క్షణాల్లోనే సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చింది. తమ ఊరి వారంటూ మోహన్‌బాబు పరిచయం చేయడం.

జంబలకిడి జారు మిఠాయి

వారు అక్కడి స్థానికత గురించి పాటలు పాడటంతో నెటిజన్లకు పండగయ్యింది. జంబ లకిడి జారు మిఠాయి అనే పదంతో పాటు వారు వాడిన చాలా వాటిని తెగ ట్రోల్‌ చేసేశారు.

ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ బుడ్డోడు చేసిన మ్యాజిక్‌ ఈ ఎప్పురా కథ. ఓ రబ్బర్ బ్యాండ్‌ని చిక్కులు చిక్కులుగా వేళ్లకు తొడిగి వాటిని మళ్లీ తీసేస్తూ చూపిస్తాడు. మ్యాజిక్ పూర్తయ్యిందంటూ ఏ ఎప్పురూ అనే చివర్లో చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆ రీల్‌ కాస్త తెగ వైరల్ అయ్యింది.

‘హే ఎప్పొరా?’

ఒక్క పాటతో సృష్టి జీవితమే మారిపోయింది. హసల్ 2.0 అనే కార్యక్రమంలో ఆమె పాడిన ‘మై నైతో కౌన్‌ బే’ అనే హిందీ రాప్‌ పాట చాలా గుర్తింపు పొందింది.  కామెడీ చేస్తూనే రాప్ చేసిన ఆమె ఓ సంచలనంగా మారిపోయింది. మాట్లాడుతూనే రాప్‌ చేయడం సృష్టి ప్రత్యేకత. ఆ తర్వాత మరెన్నో రాప్స్ చేసింది.

సృష్టి థవ్‌డే

ఇన్‌స్టా రీల్స్‌లో ఫేమస్ అయిన నిహారిక తర్వాత సినిమా స్టార్స్‌తో ప్రమోషన్స్‌ రీల్స్ చేసి ఫేమస్ అయ్యింది. ట్రిపుల్ ఆర్, లైగర్, మహేశ్‌బాబు, అడివి శేష్‌తో కలిసి చేసిన మేజర్ ఈవెంట్ చాలా గుర్తింపు తెచ్చాయి. ఆమెను చాలామంది ఫాలో అవుతున్నారు.

నిహారిక NM

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.