2022లో మార్మోగిన దర్శకులు వీరే

YouSay Short News App

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఉత్తమ నటుల్ని కలిపి రాజమౌళి, తగ్గేదేలే అంటూ సుకుమార్, హను రాఘవపూడి సీతారామం, ఆచార్యతో కొరటాల శివ, రాధే శ్యామ్‌ రాధా కృష్ణ ఇలా హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా దర్శకుల పేర్లు వినిపించాయి.

ఇక డీజే టిల్లుతో రప్ఫాండించిన విమల్ కృష్ణ, బింబిసార వశిష్ఠ్, ఒకే ఒక జీవితం శ్రీ కార్తీక్ ఇలా చాలామంది కొత్తవారి పేర్లు ప్రేక్షకుల నోళ్లలో కదిలాయి.

ఎస్.ఎస్. రాజమౌళి పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్‌తో భారీ హిట్టు ఇచ్చి తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. మహేశ్‌బాబుతో సినిమా ప్రకటించడంతో జక్కన్న పేరు మూడేళ్లుగా మార్మోగుతోంది.

రాజమౌళి

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌లో గుర్తింపు సంపాదించిన దర్శకుడు సుకుమార్. తగ్గేదే లే మేనరిజం ఎక్కడ చూసిన అలరించటానికి సుకుమార్ ప్రతిభే కారణం. ప్రస్తుతం పుష్ప2  పై వర్క్‌ చేస్తున్నాడు.

సుకుమార్‌

ప్రేమ కథల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సీతారామం కథను పరిచయం చేశారు. దుల్కర్ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్‌తో ప్రేమ కావ్యాన్ని లిఖించి ఆదరణ పొందారు.

హను రాఘవపూడి

కార్తికేయ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్‌ రావటంతో చందు మెుండేటికి కూాడా గుర్తింపు వచ్చింది. అతడికి బాలీవుడ్‌ ఆఫర్లు వచ్చినట్లు టాక్.

చందు మెుండేటి

గతేడాది అఖండతో భారీ విజయం అందుకున్న బోయపాటి శీను అఖండ-2ను తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పూర్తి చేసినట్లు టాక్. అంతేకాదు మోక్షజ్ఞ ఆరంగేట్ర దర్శకుడు బోయపాటియేనని ప్రచారం.

బోయపాటి శీను

కమల్ హాసన్‌తో విక్రమ్‌ సినిమా తీసిన లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ప్రపంచంలోకి తీసుకెళ్తానని మాటిచ్చాడు. తన తదుపరి చిత్రాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు

లోకేశ్ కనగరాజ్

కేజీఎఫ్ 2తో ఆల్‌ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టి మాస్ ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్, తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాలు లైన్‌లో పెట్టాడు. బాక్సాఫీస్‌ దున్నేందుకు సిద్ధమంటున్న ఇతడి పేరు ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది.

ప్రశాంత్ నీల్

రిషబ్ షెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా ప్రభంజనం చెప్పనక్కర్లేదు. విడుదలైన అన్నిచోట్ల మంచి టాక్ తెచ్చుకోవడంతో రిషభ్‌కు పాన్‌ ఇండియా లెవెల్లో పేరొచ్చింది.

రిషబ్ షెట్టి

బింబిసార సినిమాతో ఆరంగేట్రం చేసినప్పటికీ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడు. కల్యాణ్‌ రామ్‌ను పవర్‌ ఫుల్‌ రోల్‌లో చూపించటమే కాకుండా ఇప్పుడు బింబిసార ఫ్రాంచైజీని తీర్చిదిద్దే పనిలో పడ్డాడు.

వశిష్ఠ్

నరుడి బతుకు నటనే అనే సినిమా ద్వారా పరిచయమై డీజే టిల్లుతో ఓ రేంజ్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానూ మెప్పిస్తున్నాడు.

విమల్ కృష్ణ

నటుడిగా చేస్తూనే శ్రీ కార్తీక్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఒకే ఒక జీవితంతో శర్వాతో పాటు తనఖాతాలోనూ హిట్ వేసుకున్నాడు. కథ సిద్ధమైతేనే అడ్వాన్స్ తీసుకుంటానని చెబుతాడు  ఈ దర్శకుడు.

శ్రీ కార్తీక్

గీతాగోవిందం సినిమాతో హిట్ అందుకొని మహేశ్‌ బాబుతో సర్కారు వారి పాట తెరకెక్కించాడు. పెద్ద హీరోలకు దర్శకత్వం చేసే సత్తా ఉందని నిరూపించాడు.

పరశురాం

ఎఫ్‌-3 సినిమా ఒక్కటే కాదు యాంకర్‌గాను, జడ్జిగాను అనిల్ ఎక్కవగా ఫేమస్‌ అయ్యాడు. మరోవైపు బాలయ్యతో NBK 108 చిత్రం ప్రారంభించి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాడు.

అనిల్ రావిపూడి

హిట్ యూనివర్స్ పేరుతో రెండో కేసును పరిచయం చేశాడు. ఏడాది చివర్లో మెరుపులు మెరిపించడమే కాకుండా పార్ట్ 3 హీరోను చూపించి వచ్చే సంవత్సరం స్లాట్‌ను బుక్‌ చేసుకున్నాడు.

శైలేష్ కొలను

వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల.. చిరంజీవి,రామ్ చరణ్‌తో ఆచార్య సినిమా తీసి ప్రేక్షకుల విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు  NTR 30తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కేందుకు సన్నద్ధమవుతున్నాడు.

కొరటాల శివ

జిల్‌ లాంటి యావరేజ్‌ సినిమాతో పరిచయమైన రాధా కృష్ణ, ప్రభాస్‌తో రాధేశ్యామ్‌ ప్రకటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, సినిమా డిజాస్టర్ కావటంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

రాధా కృష్ణ

విజయ్ దేవరకొండతో లైగర్ చిత్రాన్ని తెరకెక్కించి పూరి జగన్నాథ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ జనగణమన మరోసారి మధ్యలోనే నిలిపివేసి వార్తల్లో నిలిచాడు.

పూరీ జగన్నాథ్

కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ రూపొందించే మారుతి పక్కా కమర్షియల్‌తో బోల్తా పడ్డాడు. కానీ ప్రభాస్‌తో సినిమాతో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ను మోత మోగించారు

మారుతి