నూతన సంవత్సరంలో జనవరి నెల టాలీవుడ్‌కు మంచి శుభారంభాన్ని ఇచ్చింది. రవితేజ నటించిన ధమాకా, సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సైతం ప్రేక్షకులను అలరించాయి. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్నాయి.
ఇక ఫిబ్రవరిలో పెద్ద హీరోల సినిమాలు పెద్దగా లేనప్పటికీ ఈ అన్ సీజన్‌లో ప్రేక్షకులను అలరించేందుకు పలు హీరోల సినిమాలు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.
కలర్ ఫొటోతో యాక్టింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు హీరో సుహాస్. మరోసారి సరికొత్త కథాంశంతో రైటర్ పద్మభూషణ్‌గా సుహాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
రైటర్ పద్మభూషణ్ - ఫిబ్రవరి ౩
ఈ సినిమాలో సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా నటించింది.
రైటర్ పద్మభూషణ్ సినిమాను షణ్ముఖ్ ప్రశాంత్ డైరెక్ట్ చేశాడు. అశిష్ విద్యార్థి, రోహిణి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మైఖేల్ సినిమాతో పక్కా యాక్షన్ డ్రామాతో ముందుకోస్తున్నాడు హీరో సందీప్ కిషన్. ఈ సినిమాలో స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైఖేల్- ఫిబ్రవరి ౩
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేస్తోంది. మైఖేల్ సినిమాను రంజిత్ జయకొడి డైరెక్ట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది.
పాప్ కార్న్ సినిమా.. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సాయి రోనాక్, అవికా గోర్ హీరో హిరోయిన్‌లుగా నటిస్తున్నారు. పాప్‌కార్న్ మూవీని మురళి గంధం డైరెక్ట్ చేశాడు. సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందిస్తున్నారు.
పాప్ కార్న్- ఫిబ్రవరి 10
బింబిసార వంటి ఇండస్ట్రియల్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ మరో వినూత్న కథాంశంతో తెర ముందుకు వస్తున్నాడు.
అమిగోస్- ఫిబ్రవరి 10
మూడు విభిన్న పాత్రల్లో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సారి మరో కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డికి అవకాశం ఇచ్చాడు.
కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు గిబ్రాన్ మ్యూజిగ్ అందిస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
సమంత లీడ్ రోల్‌లో వస్తున్న పౌరాణిక నేపథ్యం ఉన్న చిత్రం శాకుంతలం. దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.
శాకుంతలం - ఫిబ్రవరి 17
అనన్య నాగళ్ళ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శాకుంతలం సినిమాను గుణశేఖర్ డైరెక్ట్ చేశారు. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు .
మణి శర్మ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.