అధిక జీతాన్నిచ్చే టెక్‌ జాబ్స్‌ ఇవే!

YouSay Short News App

దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం టెక్నాలజీ. నిరంతరం కొత్త పుంతలు తొక్కే ఈ రంగంలో ఉద్యోగాల కోసం యువత ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.

టెక్‌ రంగంలో ఆధునిక పోకడలతో కూడిన లైఫ్‌తో పాటు మంచి జీతం కూడా ఉంటుంది. అందుకే ఇప్పడు డేటా సైన్స్‌, AI,ML డెవాప్‌ ట్రైనింగ్‌ వంటి కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. మరి టెక్‌ రంగంలో అత్యధిక శాలరీనిచ్చే 10 జాబ్స్‌ ఏవో తెలుసుకోండి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ మేనేజర్‌ సగటు జీతం రూ.31.2లక్షలు. ఏడాదికి రూ. 13.1 లక్షల నుంచి రూ. 94.5 లక్షల వరకు వీరి జీతం ఉంటుంది.

1.సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ మేనేజర్‌

ఇదొక అడ్మినిస్ట్రేటివ్‌ జాబ్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పనిని పర్యవేక్షించడం, ప్రాజెక్టులు, డిజైన్‌, డెవెలప్‌మెంట్‌, అప్లికేషన్స్‌కు బాధ్యత వహించడం వీరి విధి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్ మేనేజర్ కావాలంటే కంప్యూటర్ సైన్స్‌ లేదా ప్రోగ్రామింగ్‌లో డిగ్రీ అయినా ఉండాలి. అలాగే అనుభవం కూడా అవసరం. ముఖ్యంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో నైపుణ్యం కలిగి ఉండాలి.

స్మార్ట్‌‌ఫోన్ లేనిదే దైనందిన జీవితం గడవలేని స్థితికి వచ్చింది. ఈ క్రమంలో మొబైల్ అప్లికేషన్ డెవలపర్లకు భారీ గిరాకీ ఏర్పడింది. ఈ కోర్సు చేసిన వారు మార్కెట్లో గౌరవప్రదమైన వేతనంతో ఉద్యోగాన్ని పొందవచ్చు.

2. మొబైల్ అప్లికేషన్ డెవలపర్

కంప్యూటర్ సైన్స్‌ లేదా ఐటీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. సగటు వేతనం రూ.5లక్షలు. రూ.1.8లక్షల నుంచి రూ.12.3లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుంది. ప్రతిభను బట్టి జీతం ఉంటుంది.

సైబర్ దాడులు, డేటా చౌర్యం, కంప్యూటర్ వైరస్, భద్రతా లోపాల నుంచి కంప్యూటింగ్ వ్యవస్థని కాపాడటమే ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ మేనేజర్ బాధ్యత. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కంపెనీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎంతో కీలకమైన ఉద్యోగమిది.

3. ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ మేనేజర్

భారత మార్కెట్‌లో ఐఎస్ సెక్యూరిటీ మేనేజర్లకు సగటుగా రూ.16.6లక్షల వార్షిక వేతనం అందుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగంపై దృష్టి సారించొచ్చు.

సంస్థకు సంబంధించిన డేటాబేస్‌లను క్రియేట్ చేసి, డేటాబేస్ మేనేజర్ వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. రోజువారీగా డేటా బేస్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ టాస్క్‌లను పూర్తి చేయాలి.

4. డేటాబేస్ మేనేజర్

కంప్యూటర్ సైన్స్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లేదా సంబంధిత కోర్సులో డిగ్రీ పూర్తి చేసి ఉన్నవారు అర్హులు.

డేటాబేస్ మేనేజర్ సగటు వార్షిక వేతనం రూ. 15లక్షలు. రూ.2లక్షల నుంచి రూ.36.7లక్షల వరకు ప్యాకేజీని పొందవచ్చు.

హ్యాకర్లు, వైరస్‌ల నుంచి కంప్యూటర్ నెట్‌వర్క్, వ్యవస్థలను పరిరక్షించడమే డేటా సెక్యూరిటీ అనలిస్ట్ ప్రధాన బాధ్యత. కంపెనీ సెక్యూరిటీ విధానాలను విశ్లేషించి.. వాటిలోని లోపాలు, బలహీనతలను సరిచేయాల్సి ఉంటుంది.

5. డేటా సెక్యూరిటీ అనలిస్ట్

కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

భారత్‌లో సగటున ఒక డేటా సెక్యూరిటీ అనలిస్ట్‌కి రూ.5.29 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు..

ఐటీ ఉద్యోగాలలో ఉత్తమ వేతనం కలిగి ఉండే ఉద్యోగం ‘ప్రొడక్ట్ మేనేజర్’. టెక్నికల్ టీమ్‌తో పనిచేస్తూ ఒక ప్రొడక్ట్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ఆలోచన నుంచి ప్రారంభం వరకు ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక బృందాన్ని నడిపించగల సత్తా, నైపుణ్యాలు ఉండాలి.

6. ప్రొడక్ట్ మేనేజర్

సేఫ్ ప్రొడక్ట్ ఓనర్/ ప్రొడక్ట్ మేనేజర్(POPM) సర్టిఫికెట్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ప్రొడక్ట్ మేనేజర్ అయ్యేందుకు అవకాశాలున్నాయి.

కంపెనీని బట్టి ప్రొడక్ట్ మేనేజర్ల వేతనం ఆధారపడి ఉంటుంది. అమెరికాలో లక్ష డాలర్లకు పైగా జీతభత్యాలుండటం గమనార్హం.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కి సంబంధించిన ప్రాజెక్టులను క్రియేట్ చేయడం, వాటిని మేనేజ్ చేస్తూ పరిరక్షించడం ఏఐ ఇంజినీర్ ప్రధాన విధి. మ్యాథ్స్, స్టాటస్టిక్స్‌పై పట్టుండాలి. ఏఐకి సంబంధించిన ఇతర కోడింగ్‌లపై విస్తృత అవగాహన కలిగి ఉండాలి.

7. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఇంజినీర్

సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏఐకి సంబంధించిన సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభ ఆధారంగా వేతనం ఉంటుంది. సగటుగా రూ.60 నుంచి రూ.80లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుంది.

ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో పరిపూర్ణత సాధించిన వారిని ఫుల్ స్టాక్ డెవలపర్లుగా వ్యవహరిస్తుంటారు. వీరికి అత్యధిక డిమాండ్ ఉంటుంది. డిజైన్ నుంచి డెలివరీ వరకు జరిగే ప్రక్రియలో ఫల్ స్టాక్ డెవలపర్ భాగస్వామి కావాల్సి ఉంటుంది.

8. ఫుల్ స్టాక్ డెవలపర్

ప్రోగ్రామింగ్‌పై పట్టుండాలి. వెబ్‌సైట్ డిజైన్, డేటాబేస్ టెక్నాలజీలపై అవగాహన ఉండాలి. కంపెనీ, అభ్యర్థి ప్రతిభ ఆధారంగా వార్షిక వేతనం ఉంటుంది. బడా కంపెనీల్లో వీరికి సగటుగా రూ.80 లక్షల వరకూ వార్షిక వేతనం ఉంటుంది.

అత్యధిక వేతనం వచ్చే ఉద్యోగాల్లో క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఒకటి. సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీపై క్లౌడ్ ఆర్కిటెక్ట్ పనిచేయాల్సి ఉంటుంది. క్లౌడ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ స్ట్రాంగ వంటి క్లౌడ్ ప్లాట్‌ఫాంలపై నైపుణ్యం సాధించాలి.

9. క్లౌడ్ ఆర్కిటెక్ట్

క్లౌడ్ ఆర్కిటెక్ట్ వార్షిక సగటు వేతనం రూ. 80లక్షలుగా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలోనూ చాలా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

డెప్లాయ్‌మెంట్, నెట్‌వర్క్ ఆపరేషన్స్‌లలో పాలుపంచుకోవడం డెవాప్స్ ఇంజినీర్ విధి. అప్లికేషన్‌ని అభివృద్ధి చేయడానికి బృందంలో డెవాప్స్ ఇంజినీర్‌గా తనవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. కోడింగ్ రాయడంపై పట్టుండాలి.

10. డెవాప్స్ ఇంజినీర్

కంపెనీని బట్టి వేతనం ఆధారపడి ఉంటుంది. డెవాప్స్ ఇంజినీర్‌ ఉద్యోగానికి అమెరికాలో 95వేల డాలర్ల నుంచి 1.40లక్షల డాలర్ల మధ్య వార్షిక వేతనం లభిస్తోంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.