బాలీవుడ్‌లో తప్పక చూడాల్సిన  ప్రేమకథా చిత్రాలు ఇవే..

YouSay Short News App

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో ప్రేమ దృశ్యకావ్యాలు సినిమాలుగా వచ్చాయి. వాటిలో వచ్చిన బెస్ట్ క్లాసిక్ చిత్రాలను ఓసారి చూద్దాం.

దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే(1995)

బాలీవుడ్‌లో వచ్చిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రాల్లో ఈ సినిమా అగ్రభాగాన ఉంటుంది.  రాజ్, సిమ్రన్ అనే యువ జంట చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. వీరిద్దరూ యూరప్ టూర్‌కు స్నేహితులతో వెళ్ళినప్పుడు కలుసుకుని ప్రేమించుకుంటారు.

సిమ్రన్ తన పెళ్ళి కోసం  భారతదేశం వస్తుంది. సిమ్రాన్ కుటుంబం మనసు గెలుచుకుని ఆ  పెళ్ళిని తప్పించి రాజ్ ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

నటీనటులు : షారుక్ ఖాన్, కాజల్, అమ్రీష్ పూరి, అనుపమ్ ఖేర్                  డైరెక్టర్       : ఆదిత్య చోప్రా సంగీతం     : జతిన్ లలిత్

ఆశికీ(1990)& ఆశికీ 2(2013)

మహేష్ బట్ నిర్మాతగా వ్యవహరించిన ‘ఆశికీ’ సినిమా సిరీస్‌  బాలీవుడ్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ రెండు సినిమాల్లో ఇద్దరు యువతీ యువకులు తమ ప్రేమను నిలుపుకోవడానికి పడే కష్టాలను హృద్యంగా చూపారు.

కల్ హో నా హో

అవేశ పరురాలైన నైనా(ప్రీతిజింటా) అనే యువతి జీవితంలోకి అమన్(షారుక్ ఖాన్) రావడంతో ఆమె పూర్తిగా మారిపోతుంది. అతన్ని ఎంతో ప్రేమిస్తుంది.

కానీ అతను ప్రాణంతకమైన వ్యాధితో బాధపడుతుంటాడు. చివరకు నైనాను ఎంతగానో ప్రేమిస్తున్న రోహిత్(సైఫ్‌అలిఖాన్)తో అమన్ కలుపుతాడు ఇది ప్రధాన కథ

నటీనటులు   : షారుక్ ఖాన్, ప్రీతి జింటా,                    సైఫ్‌అలిఖాన్ డైరెక్టర్        : నిఖిల్ అద్వాని సంగీతం      : శంకర్ ఈషన్ లాయ్

కుచ్ కుచ్ హోతా హై(1998)

రాహుల్ ఖన్నా(షారుక్ ఖాన్) అంజలి శర్మ(కాజల్) కాలేజీలో మంచి స్నేహితులు. అంజలి, రాహుల్‌తో ప్రేమలో పడుతుంది.కానీ  రాహుల్ అప్పటికే టీనా మల్హోత్రా(రాణిముఖర్జి)తో ప్రేమలో ఉన్నాడని అంజలి తెలుసుకుని వారికి దూరంగా వెళ్ళిపోతుంది.

టీనా, రాహుల్ వివాహం చేసుకుంటారు, వారికీ అంజలి అనే ఒక కుమార్తె ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమస్యల కారణంగా టీనా చనిపోతుంది. ఏటా ఆమె పుట్టినరోజున రాహుల్ తన కుమార్తెకి తన తల్లి లేఖలో ఒకదాన్ని చదవడానికి అనుమతిస్తాడు. ఈ లేఖల ద్వారా అంజలి రాహుల్‌తో ప్రేమలో ఉందని తెలుసుకుని, వారిని మళ్లీ కలిపేస్తానని కూతురు శపథం చేస్తుంది.

నటీనటులు : షారూఖ్ ఖాన్ కాజోల్                  రాణి ముఖర్జీ సల్మాన్ ఖాన్                  సనా సయీద్ ఫరీదా జలాల్

రబ్‌నే బనాది జోడీ(2008)

సురిందర్( షారుక్ ఖాన్) తన గురువు కూతురు తానియాను అనివార్యకారణాల వల్ల పెళ్లి చేసుకుంటాడు.  సురిందర్ పాతకాలంనాటి వాడు. స్వతంత్ర భావాలు కలిగిన తానియాకు డ్యాన్సర్ కావాలని కోరిక.

ఈక్రమంలో మోడ్రన్ లుక్‌లో  రాజ్‌కపూర్‌గా మారిన సురిందర్‌ను తానియా ప్రేమిస్తుంది.  ఈ విషయం తానియాకు తెలియదు. చివర్లో  నిజం తెలిసిన తానియా సురిందర్ ప్రేమను అంగీకరిస్తుంది.

నటీనటులు  : షారుక్ ఖాన్ అనుష్క శర్మ డైరెక్టర్       : ఆదిత్య చోప్రా సంగీతం     : సలీం సులేమాన్

తెరే నామ్(2003)

సల్మాన్ ఖాన్ నటించిన తెరే నామ్ బాలీవుడ్‌లో కల్ట్ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.   ఈ సినిమాలో రౌడిగా ఉన్న రాధే మోహన్ తనను ద్వేషించే నీరజ అనే యువతి ప్రేమలో పడుతాడు.

ఆమె ప్రేమను దక్కించుకునేందుకు రౌడీయిజాన్ని వదిలివేసిన రాధేపై కొంతమంది దాడి చేస్తారు. మెదడుకు దెబ్బతగిలి మానసిక వికలాంగుడిగా మారుతాడు.

నటీనటులు : సల్మాన్ ఖాన్ భూమిక చావ్లా డైరెక్టర్      : సతీష్ కౌషిక్ సంగీతం    : హిమేష్ రెషామియా

దేవదాసు(2002)

భారతీయ ఎవర్‌గ్రీన్ చలనచిత్రాల్లో దేవదాసు ఒకటి.  సంపన్న కుటుంబానికి చెందిన దేవదాసు తన చిన్ననాటి స్నేహితురాలు పార్వతితో ప్రేమలో పడుతాడు.

కానీ ఆమెను పెళ్లిచేసుకునేందుకు కుటుంబం ఒప్పుకోదు. దీంతో తాగుడుకు బానిసైపోతాడు. అతని బాగోగులను చంద్రముఖి అనే నర్తకి చూసుకుంటుంది.

నటీనటులు : షారుక్ ఖాన్ ఐశ్వర్యరాయ్                  మాధురి దీక్షిత్

రాక్‌స్టార్(2011)

బాలీవుడ్‌లో వచ్చిన విషాదభరితమై ప్రేమకథల్లో రాక్‌స్టార్ ఒకటి. రాక్ స్టార్ కావాలని కలలు కనే జనార్థన్ జాకర్, హీర్ అనే యువతిని ప్రేమిస్తాడు.కానీ ఆమెకు వేరొకరితో పెళ్లి జరగుతుంది. కాలక్రమంలో హీర్‌కు జనార్థన్‌పై తన ఫీలింగ్స్ మారుతాయి.

తాను ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో తన బాధనుంచి బయటపడేందుకు దేశంలో పెద్ద రాక్‌స్టార్‌గా మారుతాడు.

నటీనటులు : రణబీర్ కపూర్ నర్గీస్ ఫక్రీ డైరెక్టర్       : ఇంతియాజ్ అలీ సంగీతం     : ఏఆర్ రెహ్మాన్

బర్ఫీ

బధిరుడైన మర్పీతో తనకు భవిష్యత్ ఉండదని భావించిన శృతి వెరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. దీంతో బాధపడుతున్న మర్ఫీకి జిల్‌మిల్ దగ్గరవుతుంది. మధ్యలో శృతి అడ్డుతగిలినా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు.

నటీనటులు : రణబీర్ కపూర్ ఇలియానా                   ప్రియాంక చోప్రా డైరెక్టర్       : అనురాగ్ బసు సంగీతం    : ప్రీతమ్

సనం తేరీ కసమ్

ఇండర్, సారుల ప్రేమ కథ ఇది. వీరి ప్రేమకు కుటుంబ తిరస్కారం, సామాజిక కట్టుబాట్లు, ఆరోగ్య సమస్యలు అడ్డుగా నిలుస్తాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఈ కథలోని ఆర్ధ్రత కన్నీళ్లు తెప్పిస్తుంది.

నటీనటులు : హర్షవర్ధన్ రానే, మావ్రా హోకనే డైరెక్టర్      : రాధిక రావు సంగీతం    : హిమేష్ రెసిమియా

వీర్ - జరా

బస్సు ప్రమాదంలో చిక్కుకున్న పాకిస్తాన్ మహిళ జరాను ఇండియన్ ఫైలట్ వీర్ ప్రతాప్ సింగ్ కాపాడుతాడు. వీరి జీవితాలు ఎప్పటికప్పుడూ మారుతాయి.క్లాసిక్ లవ్ స్టోరీకి సంబంధించిన అన్ని అంశాలు ప్రేమ, ఎడబాటు, ధైర్యం కూడి ఉన్న కథ ఇది.

రంఝానా

కుందన్ అనే తమిళ్ బ్రహ్మన్ యువకుడు జోయాను ప్రేమిస్తాడు. కానీ జోయకు అతనంటే ఇష్టం ఉండదు. తాను ముస్లీం కాకున్న అబద్దం చెప్పి తప్పించుకుంటుంది. ఈ సినిమాలో అనేక ట్విస్టులు ఉంటాయి.

నటీనటులు : ధనుష్, సోనమ్ కపూర్,                    అభయ్ డియోల్  డైరెక్టర్       : ఆనంద్ రాయ్ సంగీతం    : AR రెహ్మాన్

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి