YouSay Short News App

WPLలో అదరగొట్టే   తెలుగు అమ్మాయిలు  వీరే!

WPLలో తెలుగు తేజాలు మెరుస్తున్నారు. ఇప్పటికే భారత క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించిన కొందరుండగా… అండర్‌ 19లో రాణించిన మరికొందరికి అవకాశం దక్కింది.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్టణం, కర్నూల్‌కు చెందిన క్రీడాకారులు దిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్ టైటాన్స్‌, యూపీ వారియర్స్‌ ఫ్రాంచైజీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తెలంగాణలోని రామగుండంలో జన్మించిన శికా పాండే  ఇప్పటికే టీమిండియాలో ఆరంగేట్రం చేసింది. ప్రస్తుతం WPLలో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫు ఆడుతుంది. మీడియం పేస్‌ అయిన ఆమె మాజీ IAF అధికారి.

శికా సుభాస్ పాండే

2018లోనే దేశం తరఫున ప్రాతినిద్యం వహించింది ఈ హైదరాబాదీ క్రికెటర్. అరుంధతీ కూడా దిల్లీ క్యాపిటల్స్‌లో కీలకమైన పేసర్.

అరుంధతీ రెడ్డి

ఆంధ్రా జట్టుకు 2021-22 మధ్య కెప్టెన్‌గా వ్యవహరించింది వూటల స్నేహా దీప్తి. ఒక వన్డే మ్యాచ్‌, 2 టీ20లు మాత్రమే ఆడిన ఆమెకు WPL కీలకం కానుంది. దిల్లీ బ్యాట్స్‌మెన్లలో స్నేహా దీప్తి ఒకరు.

స్నేహా దీప్తీ

సబ్బినేని మేఘన ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాకు చెందిన యంగ్ క్రికెటర్. ఇండియా తరఫున కొంతకాలంగా రాణిస్తూ పేరు తెచ్చుకుంది. గుజరాత్‌ టైటాల్స్‌లో స్టార్‌ ఓపెనర్‌.

సబ్బినేని మేఘన

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్టణం వాసి శభ్నామ్ ఎండీ షకీల్. ఇటీవల అండర్ 19 ప్రపంచకప్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకుని అందరి దృష్టిలో పడింది. గుజరాత్‌ టైటాన్స్‌ ఆమెను వేలంలో దక్కించుకున్నారు.

శభ్నామ్ ఎండీ షకీల్‌

కేశవరాజుగారి అంజలీ శర్వాణీ గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టింది. ఏపీలోని కర్నూలుకి చెందిన ఆమె ఆంధ్ర, రైల్వేస్‌ తరఫున ఆడింది. ప్రస్తుతం యూపీ వారియర్స్‌లో బెస్ట్‌ బౌలర్‌.

కేశవరాజుగారి అంజలి శర్వాణీ,

సొప్పదండి వేణుగోపాల యశస్త్రీ కూడా అండర్‌ 19 జట్టులో సభ్యురాలు. తన బౌలింగ్‌తో మెరుగైన ప్రదర్శన చేసింది ఈ హైదరాబాదీ. ప్రస్తుతం యూపీ వారియర్స్‌లో ఉంది.

సొప్పదండి వేణుగోపాల యశస్త్రీ