తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభంగా జరుపుకుంటారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటల ఘుమఘుమలు ఇలా ఎన్నో కలగలిసిన మధురమైన వేడుక ఇది.
ఇలాంటి వేడుకను ప్రతిబింబించేలా ఎన్నో తెలుగు పాటలు ఉన్నాయి. తెలుగింటి సంప్రదాయంతో పాటు పండగకి పల్లెటూరు వాతావరణం తెలియజెప్పే కొన్ని పాటలు.
శతమానం భవతి
శర్వా నటించిన ఈ కుటుంబ కథా చిత్రంలో “మెల్లగా తెల్లారిందోయ్ అలా” అనే పాట పండుగకు చుట్టూలు ఊరొచ్చే సన్నివేశాన్ని వివరిస్తూ మనసులకు హత్తుకుంటుందంటే అతిశయోక్తి కాదు.
ఇదే చిత్రంలోని “హైలో హైలోస్సారే” అనే పాటలోసంక్రాంతి సంబరాలు, ముత్యాల ముగ్గులు, బావ మరదళ్ల సరసాలను తెలిపే లిరిక్స్‌కు..మిక్కీ జే మేయర్ ట్యూన్ వినసొంపుగా ఉంటుందంటే నమ్మండి.
బతుకుదెరువు కోసం పట్నం వెళ్లి పండగకి ఊరొచ్చిన వాళ్లందరూ సంతోషంగా గడుపుతూ ఉండే సన్నివేశంలోవచ్చే పాట “సందళ్లే సందళ్లే సంక్రాంతి సందళ్లే”. ఇందులో కూడా శర్వానే హీరో, మిక్కీదే సంగీతం
నితిన్, సమంత నటించిన అఆ చిత్రంలోని “నిద్దుర చాలని బద్ధకమల్లే ఒల్లిరిసింది ఆకాశం” అనే పాట పల్లెటూరి వాతావరణాన్ని తెలుపుతూ సాగుతుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ సాంగ్ సూపర్ హిట్.
మహేశ్ బాబు కెరీర్‌లో సూపర్ హిట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలోని ఓ పాటలో “గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి”అంటూ వచ్చే పాట సంప్రదాయలని తెలియజేస్తుంది.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే కచ్చితంగా టీవీలో ఈ బొమ్మ పడాల్సిందే. ఇందులో కుటుంబాల మధ్య అనుబంధాలను వివరించే సినిమాలో “డోలీ డోలీ” అనే పాట ఇప్పటికీ సూపర్ హిట్.
కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన రాముడొచ్చాడు చిత్రంలో పండగకి వచ్చే “మా పల్లె రేపల్లంట” అనే పాటను ఎస్బీబీ, చిత్ర ఆలపించి మెప్పించారు. ఇది కూడా పండుగను తెలిపే సాంగ్.
ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో మెహన్‌బాబు హీరోగా వచ్చిన చిత్రంలో “సంక్రాంతి వచ్చింది తుమ్మెద సరాదాలు తెచ్చింది తుమ్మెద” అనే పాట ఇప్పటికీ మోగుతూనే ఉంటుంది.