రాహుల్ గాంధీ ఫేవరెట్ బైక్ ‘అప్రిలియా ఆర్ఎస్ 250’ ప్రత్యేకతలు ఇవే!
YouSay Short News App
ఖరీదైన ఎన్‌ఫీల్డ్ బైకులు, కార్లు అంటే తనకు ఇష్టం ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనసులో మాట చెప్పారు. అయితే, ‘అప్రిలియా ఆర్ఎస్ 250’ తన ఆల్ టైం ఫేవరెట్ బైక్ అని సెలవిచ్చారు. దీంతో ఈ బైక్ విశేషాలేంటా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఇంతకీ ‘అప్రిలియా ఆర్ఎస్ 250’ బైక్ ప్రత్యేకతలేంటి? ఈ కంపెనీ ఏ దేశానికి చెందింది? ఇతర వాహనాలతో పోలిస్తే ఈ బైక్ గొప్పతనం ఏంటో తెలుసుకుందామా.
అప్రిలియా అనేది ఇటలీకి చెందిన మోటార్ వెహికల్ కంపెనీ. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక.. 1944లో ఈ కంపెనీ ఏర్పాటైంది. మోటార్ సైకిల్స్‌తో పాటు స్కూటర్లను కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.
ఇటలీ కంపెనీ
125 సీసీ నుంచి మొదలు పెడితే 1000 సీసీ ఇంజిన్‌తో అప్రిలియా బైక్‌లను తయారు చేస్తోంది. రేసింగ్ కోసం కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తోంది.
1000 సీసీ వరకూ..
రేసింగ్‌ని దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ని డిజైన్ చేసింది అప్రిలియా. కానీ, తయారు చేసింది మాత్రం మినీమోటో రేసింగ్ బైక్‌లను ఉత్పత్తి చేసే ఒహ్‌వాలె సంస్థ. 2020లో ఇది లాంచ్ అయింది.
స్పోర్ట్స్ బైక్
250సీసీలోనే వివిధ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్ఎస్ 250, ఆర్ఎస్ 250 ఎస్పీ, జీపీఆర్ 250 బైకులను తయారు చేసింది.
వివిధ వేరియంట్లు
అప్రిలియా ఆర్ఎస్ 250 ధర తక్కువేం కాదు. సంస్థ అందించిన అన్ని ఫీచర్లు కావాలని అనుకుంటే
ఈ బైక్ కోసం రూ.7.95 లక్షలు వెచ్చించాల్సిందే.
ఇక ప్రారంభ ధర రూ.3లక్షలుగా ఉంది.
ధర తక్కువేం కాదు
250సీసీ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్న బైక్ ఇది. 11ఏళ్ల బాలుడు కూడా నడపగలిగేలా దీన్ని తీర్చిదిద్దినట్లు అప్పట్లో సంస్థ వెల్లడించింది. దీని బరువు కేవలం 105 కిలోలే.
తేలిక
ఓలిన్స్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేకులు, తేలికపాటి టైర్లు, డిజైన్‌కి ఉపయోగించిన అల్యుమినియం రేకులు
ఈ బైక్‌కి అదనపు ఆకర్షణ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ బైక్ సొంతం.