ఫిఫా వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో

తలపడే జట్లు ఇవే

YouSay Short News App

క్రిస్టియానో రొనాల్డో సారధ్యంలోని పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.

పోర్చుగల్ జట్టు 2006 తర్వాత మళ్లీ ఇప్పుడు క్వార్టర్స్ చేరింది.

స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో షూటౌట్‌లో గట్టెక్కిన మొరాకో తప్ప, మిగతా యూరోపియన్, దక్షిణా అమెరికా జట్లు ఒక ప్రణాళిక ప్రకారం రౌండ్16ను ముగించాయి.

రౌండ్16 ఫలితాలు

-హోరాహోరీ పోరులో అమెరికాను 3-1 తేడాతో  నెదర్లాండ్స్ ఓడించింది. -మెస్సీ మాయాజాలంతో 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై   అర్జెంటీనా విజయం సాధించింది.

- జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెనాల్టీ షూటౌట్‌లో    క్రొయేషియా గట్టెక్కింది. - సౌత్ కొరియాపై బ్రెజిల్ గోల్స్ వర్షం కురిపించి    గెలిచింది.

- డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్.. పోలాండ్‌ను 3-1    తేాడాతో చిత్తు చేసింది. - ఇంగ్లండ్ 3-0 తేాడాతో సెనెగల్‌పై అద్భుత    విజయం సాధించింది.

- ఫెనాల్టీ సూటౌట్‌లో స్పెయిన్‌ను మొరాకో మట్టి    కరిపించింది. - రొనాల్డో సారధ్యంలోని పోర్చుగల్ గోల్స్ వర్షం   కురిపించి 6-1 తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించింది.

ఈ ఎనిమిది జట్లు క్వార్టర్స్‌లో తమ బెర్తును ఖరారు చేసుకున్నాయి. వీటిలో 5 జట్లు యూరప్, రెండు జట్లు దక్షిణ అమెరికా, ఒక జట్టు ఆఫ్రికా ఖండానికి చెందినది.

యూరోపియన్ జట్లు

ఫ్రాన్స్ ఇంగ్లండ్ పోర్చుగల్ నెదర్లాండ్స్ క్రొయేషియా

దక్షిణ అమెరికా జట్లు

అర్జెంటీనా బ్రెజిల్

ఆఫ్రికా జట్లు

మొరాకో

ఉత్కంఠ రేపే క్వార్టర్ ఫైనల్ ఫిక్చర్స్ వివిధ ఖండాలకు చెందిన దేశాలు క్వార్టర్స్‌లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.