డిసెంబర్‌లో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..!

YouSay Short News App

మంచి విజయాలతో ఈ ఏడాది ముగించాలని టాలీవుడ్ భావిస్తోంది. అందుకు తగ్గట్టే డిసెంబర్‌లో పలు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దామా.

‘రాక్షసన్’ నటుడు విష్ణు విశాల్ తమిళంలో నటించిన ‘గట్ట కుస్తీ’ సినిమా తెలుగులో ‘మట్టి కుస్తీ’గా విడుదలవుతోంది. ఈ సినిమాను తమిళ్, తెలుగు, మళయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని భారత సంప్రదాయ యుద్ధ కళల నేపధ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు.

మట్టి కుస్తీ - డిసెంబర్ 2

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్ 2’ మూవీ డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో శేష్.. కృష్ణదేవ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించగా... నాచురల్ స్టార్ నాని నిర్మించారు. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హిట్ 2 - డిసెంబర్ 2

పద్మశ్రీ డా.విజయ్ శంకేశ్వర్ జీవిత కథ ఆధారంగా ‘విజయానంద్’ మూవీ తెరకెక్కింది. వీఆర్ఎల్ సామ్రాజ్యానికి అధినేత ఎలా అయ్యాడో ఈ చిత్రంలో చూపించనున్నారు. నిహాల్ ఆర్, భరత్ బోపన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

విజయానంద్ - డిసెంబర్ 9

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘డీఆర్ 56’ మూవీ డిసెంబర్ 9న రిలీజ్ అవుతుంది. ప్రియమణి ఈ చిత్రంలో సీబీఐ అధికారి ప్రియగా కనిపించబోతున్నారు. మూవీలో ప్రవీణ్ రెడ్డి ఒక ప్రధాన పాత్ర పోషించారు.

డీఆర్ 56 - డిసెంబర్ 9

2009లో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ చిత్రాన్ని మనమందరం ఇంకా మర్చిపోలేదు. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ రాబోతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పుతుందని అందరూ భావిస్తున్నారు. అవతార్ 1 కలెక్షన్లను ఇప్పటికీ ఏ సినిమా బద్దలు కొట్టలేకపోయింది. మరి సీక్వెల్ ఎంత మేర కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ - డిసెంబర్ 16

తమిళ్ స్టార్ విశాల్ నటించిన ‘లాఠీ’  ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సారి పవర్‌ఫుల్ పోలీస్‌గా విశాల్ అలరించడం ఖాయమనిపిస్తోంది.. విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎ.వినోద్ కుమార్ తెరకెక్కించారు.

లాఠీ - డిసెంబర్ 22

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు.

అన్నీ మంచి శకునములే - డిసెంబర్ 21

డిసెంబర్‌లో విడుదలయ్యే చిత్రాల్లోకెల్లా అతి పెద్ద సినిమా ‘ధమాకా’. మాస్ మహరాజా రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాటలు కూడా శ్రోతలను అలరిస్తున్నాయి.

ధమాకా - డిసెంబర్ 23

కార్తికేయతో హిట్ కొట్టిన సక్సెస్ పెయిర్ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘18 పేజీస్’ రూపొందుతోంది. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. సుకుమార్‌ కథ అందించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

18 పేజీస్ - డిసెంబర్ 23

టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘మైకేల్’ తెరకెక్కుతోంది. 2022 చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. అదే ఊపుతో చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

మైఖేల్ - డిసెంబర్ 30

’టాప్ గేర్‘ మూవీతో ఆది సాయికుమార్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తన వరుస పరాజయాలకు ఈ సినిమాతో పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడు. ఆది సరసన రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. శశికాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

టాప్ గేర్ - డిసెంబర్ 30