40కి చేరువైనా తరగని అందం  ఈ హీరోయిన్ల సొంతం

YouSay Short News App

వయసు పెరిగిన కొద్ది అందం తగ్గుద్ది అంటారు. కానీ, కొంతమంది హీరోయిన్లు 35 సంవత్సరాలు దాటినా ఇంకా అందంగా తయారువుతున్నారు. వాళ్లెవరో ఓ సారి లుక్కేయండి.

శ్రియా సరన్

శ్రియా సరన్ 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

త్రిష కృష్ణన్‌

త్రిష 1983 మే 4న జన్మించింది. ఈ ఏడాది 40లోకి అడుగుపెట్టబోతుంది ఈ అమ్మడు. అయినా పొన్నియన్ సెల్వన్‌, విజయ్ తదుపరి చిత్రంలో తన అందంతో హీరోయిన్ ఛాన్స్‌ కొట్టేసింది.

నయనతార

నయన్ 1984 నవంబర్ 18న పుట్టింది. 38 సంవత్సరాల వయసులోనూ తన అందానికి సాటి లేరనే విధంగా ఆకర్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అంజలి

ఈ సంవత్సరం 37వ పుట్టినరోజు జరుపుకోనుంది అంజలి. జూన్‌ 16, 1986లో జన్మించింది. ఇప్పటికీ ఆమెది చెరగని అందం.

శృతి హాసన్‌

శృతి హాసన్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతుంది ఈ  మెరుపుతీగ.  ఆమె వయసు ప్రస్తుతం 37. 1986 జనవరి 26న జన్మించింది  ఈ సొగసరి.

కాజల్ అగర్వాల్‌

కాజల్ అగర్వాల్‌ వయసు 37 ఏళ్లు.  వివాహం జరిగి కుమారుడికి జన్మనిచ్చినప్పటికీ ఇప్పటికీ సూపర్ హాట్‌గా కనిపిస్తుంది ముంబయి భామ.

శ్రద్ధా దాస్

శ్రద్ధా దాస్ ఇటీవలె 36వ పుట్టినరోజు జరుపుకుంది. శ్రద్ధా ఫొటోల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు.

ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌లోనూ చాలామంది హీరోయిన్లు వయసు పెరిగినా పరువాలతో ఆకట్టుకుంటున్నారు. 40 ఏళ్ల వయసున్న ప్రియాంక చోప్రాకి అందులో మెుదటిస్థానం దక్కుతుంది.

కత్రినా కైఫ్

1983 జులై 16న పుట్టిన ఈ బ్రిటీష్ సుందరి ఈ ఏడాది 40వ వసంతంలోకి చేరుకుంటుంది. అయినా తన పరువాలతో కనువిందు చేస్తూనే ఉంది పొడుగుకాళ్ల సుందరి.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran