ఫిఫా వరల్డ్‌కప్ 2022 గురించి తప్పకుండా  మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

YouSay Short New App

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఖతార్‌లో జరగబోతోంది. ఈ ఫుట్‌బాల్ పండుగకు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు సిద్ధమయ్యారు. ఖతార్‌ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు దాదాపు నెల రోజుల పాటు ఫిఫా వరల్డ్‌కప్ 2022 జరగనుంది.

ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు తలపడనున్నాయి. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఖతార్‌లోని లూసైల్ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది.

మధ్య ఆసియా దేశాల్లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఖతార్‌లో విపరీతమైన వేడి ఉండడంతో.. ఈ టోర్నీని వేసవికి బదులు శీతాకాలంలో నిర్వహిస్తున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ టోర్నీని ప్రారంభించనుంది. ఈ జట్టు 2018లో రష్యాలో జరిగిన ఎడిషన్‌లో విజేతగా నిలిచింది.

ఖతార్‌లోని మొత్తం 8 స్టేడియాల్లో ప్రపంచకప్  మ్యాచ్‌లు జరుగుతాయి.

ఖతార్ ఎడారి ప్రాంతం కావడంతో మ్యాచ్‌లు జరిగే మొత్తం 8 స్టేడియాల్లో ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఏర్పాటు చేసింది ఖతార్ ప్రభుత్వం.

మొత్తం 32 జట్లను ఒక్కో గ్రూప్‌లో నాలుగేసి టీమ్‌లతో  8 గ్రూపులుగా విభజించారు

1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మస్కట్ సంప్రదాయం ప్రారంభించారు. ప్రస్తుతం ఖతార్ వరల్డ్‌కప్‌లోనూ ‘లాయీబ్’ మస్కట్ ఆవిష్కరించారు. దోహాలో జరిగిన ఫైనల్ డ్రాలో దీనిని ఆవిష్కరించారు.

బ్రెజిల్

టైటిల్ ఫేవరెట్లు

ఫ్రాన్స్

బెల్జియం

అర్జెంటీనా

ఇంగ్లండ్

పోర్చుగల్

స్పెయిన్

స్పోర్ట్స్18 చానెల్

భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ వీక్షించవచ్చు?

జియో సినిమా

ప్రతి రోజూ నాలుగేసి మ్యాచ్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 3;30, సాయంత్రం 6;30, రాత్రి 9;30, అర్ధరాత్రి 12;30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

క్రీడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గేమ్‌గా ఫుట్‌బాల్ క్రీడకు పేరు. వరల్డ్‌కప్ విజేతకు 38 మిలియన్ యూరోలు.. అంటే అక్షరాల రూ.344 కోట్ల  ప్రైజ్‌మనీ ఇస్తారు.

ఫీఫా వరల్డ్ కప్-2022  ప్రైజ్‌మనీ ఎంతంటే?

రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 27.27 మిలియన్ యూరోలు.. అంటే రూ.245 కోట్లు ముట్టచెబుతారు.

వరల్డ్‌కప్ విజేతకు 38 మిలియన్ యూరోలు (రూ.344 కోట్లు) ప్రైజ్‌మనీ

రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 27.27 మిలియన్ యూరోలు (రూ.245 కోట్లు) ప్రైజ్‌మనీ

మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 24.45 మిలియన్ యూరోలు (రూ.220 కోట్లు) ప్రైజ్‌మనీ