షారూక్‌ ఖాన్ ‘జవాన్‌’లో  అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇదేనట!..  ఇక సినిమా తగ్గేదెలే

YouSay Short News App

షారూక్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది.

జవాన్ సినిమాలో షారూక్‌కి సోదరుడిగా ఐకాన్ స్టార్ నటించనున్నట్లు తెలిసింది. దీంతో మరోసారి బన్నీ మాస్ పర్ఫార్మెన్స్ పక్కా అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

‘జవాన్’ మూవీలో బన్నీ పవర్‌ఫుల్ ఆర్మీ అధికారి పాత్ర పోషించనున్నాడని సమాచారం. 15నిమిషాల నిడివితో బన్నీ పాత్రను డిజైన్ చేశారట.

‘జవాన్’ డైరెక్టర్ అట్లీ ఐకాన్ స్టార్‌కి కథ కూడా వినిపించారట. దీనికి అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పుష్ప సినిమాతో బీ టౌన్‌ ఫ్యాన్స్‌ని అలరించిన అల్లు అర్జున్.. తాజాగా షారూక్‌తో జత కట్టడం ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించడం బన్నీకి కొత్తేమీ కాదు. గతంలోనూ బన్నీ ఈ పాత్ర పోషించాడు. వక్కంతం వంశీ తెరకెక్కించిన ‘నా పేరు సూర్య’ సినిమాలో సైనికుడిగా నటించాడు.

‘నా పేరు సూర్య’ సినిమాలో బన్నీ ఫర్ఫార్మెన్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 2018లో ఈ సినిమా విడుదలైంది.

ఇందులో యాటిట్యూట్ ఉన్న సైనికాధికారిగా అల్లు అర్జున్ ఇరగదీశాడు. ఈ పర్ఫార్మెన్స్‌ని చూశాక ‘జవాన్’ పాత్రకు బన్నీని సంప్రదించినట్లు టాక్.

అయితే, ‘జవాన్’లో తమిళ హీరో విజయ్ నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అట్లీ పుట్టినరోజుకు షారూక్, విజయ్ కలిసి దిగిన  ఫొటో ఇందుకు ఊతమిచ్చింది.

‘జవాన్’లో కేమియో రోల్ కోసం విజయ్‌ని సంప్రదించారని టాక్. మరి విజయ్ చేయాల్సిన పాత్రలోనే బన్నీ నటించనున్నాడా? లేదా వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

షారూక్, విజయ్, అల్లు అర్జున్ కలిస్తే ఇక ఇది  పాన్ ఇండియా సినిమాగా మారుతుంది. బన్నీ, విజయ్‌లకు సౌత్ ఫ్యాన్స్ ఎక్కువ కావడం విశేషం.

ఇప్పటికే ‘జవాన్’ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దీపిక పదుకొణె, నయనతార, ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు. బన్నీ యాడ్ అవ్వడంతో బిగ్గెస్ట్ మూవీగా మారనుంది.

హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘జవాన్’ విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

2023 జూన్ 2న ‘జవాన్’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.